AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన FSSAI లైసెన్సుతో 'JJ ఫుడ్స్' పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తు్న్నట్టు గుర్తించారు. హోటళ్లు, కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న 4000 కేజీల కల్తీ పేస్ట్, గ్రైండింగ్ మెషీన్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
Food Adulteration Hyderabad
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 10:22 PM

Share

హైదరాబాద్ నగరంలో మరో కల్తీ ఆహార తయారీ కేంద్రం బట్టబయలైంది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్. మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఇంటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో మానవ ఆరోగ్యానికి హానికరంగా అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అబిడ్స్‌కు చెందిన జసాని ఇల్యాన్ ‘JJ ఫుడ్స్’ పేరుతో ఈ వ్యాపారం నిర్వహిస్తూ గడువు ముగిసిన FSSAI లైసెన్స్ ను ఉపయోగించి హోటళ్లు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తయారు చేసిన పేస్ట్‌ను బహిరంగ ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేయడం వల్ల ధూళి, ఈగలు, ఇతర కలుషితాలు చేరి అది వినియోగానికి ప్రమాదకరంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

తనిఖీల్లో మొత్తం 4 వేల కేజీల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 40 టబ్బుల్లో 1,600 కేజీలు, 5 కేజీల కంటైనర్లు 130 , 1 కేజీ కంటైనర్లు 900, 500 గ్రాముల కంటైనర్లు 300, 200 గ్రాముల కంటైనర్లు 3,000 , 50 గ్రాముల ప్యాకెట్లు 2,000 ఉన్నాయి. అదేవిధంగా రెండు గ్రైండింగ్ మెషీన్లు, 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బస్తాల ఉప్పు సరఫరాకు వినియోగిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం లేక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!