కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీజేపీ నిర్వహించిన మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్కు మద్దతుగా, కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనకు కౌంటర్‌గా బీజేపీ ఈ యాత్రను నిర్వహించింది. గన్‌పౌండ్రీ నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగిన మహాపాదయాత్రలో అమిత్ షా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.