AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!

Phani CH
|

Updated on: Nov 03, 2026 | 1:02 PM

Share

ఏపీ మీదుగా బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ రైలును బెంగళూరులో ప్రారంభించారు. అనంతపురం, గుంతకల్లు సహా మొత్తం ఎనిమిది స్టేషన్లలో ఆగుతుంది. 16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో నడిచే ఈ రైలులో థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర రూ.2,810 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం మీదుగా తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో వందే భారత్ రైళ్లు నడుస్తోండగా.. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు కూడా పరుగులు తీస్తోంది. అనేక చర్చల తర్వాత రాష్ట్రం మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. ఆదివారం బెంగళూరులో ఈ రైలును రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రారంభించారు. బెంగళూరు-ముంబై మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టారు. బెంగళూరు నుంచి బయల్దేరి హుబ్లీ మీదుగా ముంబైకి జర్నీ చేస్తుంది. ఈ రైలు మార్గం మధ్యలో మొత్తం 8 స్టేషన్లలో ఆగుతుంది. అందులో భాగంగా ఏపీలోని అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో స్టాపులు కల్పించారు. దీంతో ఏపీ ప్రజలకు కూడా వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు సోమవారం నుంచి రెగ్యులర్ సర్వీసులు అందిస్తుంది. దేశంలో మూడో వందే భారత్ స్లీపర్ రైలుగా ఇది నిలిచింది. బెంగళూరు నుంచి హుబ్లీ మీదుగా ప్రయాణించనున్న ఈ రైలు.. కర్ణాటకలోని అన్ని ప్రాంతాలను కలుపుతుంది. అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురిగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంలో మొత్తం రెండు వందే భారత్ స్లీపర్ సెట్లను నడపనున్నారు. ఈ రైల్లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. బెంగళూరు-ముంబై మధ్య సోమవారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులు అందించనుండగా.. ఇక ముంబై-బెంగళూరు రైలు మంగళవారం మినహా మిగతా 6 రోజుల్లో నడుస్తుంది. నిర్వహణ కోసం ఒక రోజు నిలిపివేయనున్నారు. టైమ్ షెడ్యూల్ ఇదిగో.. నవంబర్ 1న ప్రారంభమవ్వగా.. నవంబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. ముంబై-బెంగళూరు(27651) వందే భారత్ స్లీపర్ రైలు రాత్రి 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గుంతకల్లు, 8.38 గంటలకు అనంతపురం, మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు-ముంబై(27652) రైలు బెంగళూరులో రాత్రి 7.45 గంటలకు బయల్దేరి అనంతపురంకు 10.28 గంటలకు, గుంతకల్లుకు 11.20 గంటలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణానికి 22 గంటలు పడుతుండగా.. ఈ రైలు ద్వారా 16 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైల్లో మొత్తం 16 ఏసీ బోగీలు ఉండగా.. 823 బెర్త్‌లు ఉంటాయి. టికెట్ ఛార్జీలు ఇవే.. వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీల విషయానికొస్తే.. బెంగళూరు నుంచి ముంబైకు థర్డ్ ఏసీ (3AC) ఛార్జీ రూ.2,810, సెకండ్ ఏసీ (2AC) ఛార్జీ రూ.3,630, ఫస్ట్ ఏసీ ఛార్జీ రూ.4,450గా రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బెంగళూరు – ముంబై ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్ ఇవాళే ప్రారంభం అయింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే పర్యవేక్షణలో నడిచే ఈ రైలు, బెంగళూరు నుంచి బయలుదేరి దాదాపు 16 గంటల్లో ముంబై కి చేరుకుంటుంది. ఈ సేవలు రెండు రైలు నంబర్లతో నడవనున్నాయి. బెంగళూరు – ముంబై రైలు నెంబరు 27652 సాయంత్రం 7:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55కి ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబై – బెంగళూరు రైలు నెంబరు 27651 రాత్రి 8:10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 2, 3 తేదీల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్గంలో అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ అనే 8 ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది. 16 కోచ్‌లతో నడిచే ఈ అధునాతన రైలులో మొత్తం 823 మంది ప్రయాణించవచ్చు. ఇందులో AC 3-టైర్ , AC 2-టైర్, AC ఫస్ట్ క్లాస్ సదుపాయాలు ఉన్నాయి. టికెట్ ధరల విషయానికొస్తే.. AC 3-టైర్‌కు రూ. 2,810, AC 2-టైర్‌కు రూ. 3,630, AC ఫస్ట్ క్లాస్‌కు రూ. 4,450గా నిర్ణయించారు. అత్యంత సౌకర్యవంతమైన బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, వెస్టిబ్యూల్స్ వంటి ఆధునిక వసతులు ఈ రైలు ప్రత్యేకతలు. ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్, యాప్‌లు లేదా PRS కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా?..‘జీతం కట్’ అంటోన్న తెలంగాణ సర్కారు

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ భారీ ఆఫర్. ముఖం మీదే తిరస్కరించి రోహిత్

హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను.. మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్

Amitabh Bachchan: గ్యాంగ్‌ స్టర్‌ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్

Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు

Follow Us