తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా?..‘జీతం కట్’ అంటోన్న తెలంగాణ సర్కారు
తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల నిర్లక్ష్యం, వేధింపులకు సంబంధించి 2021 నుంచి ఇప్పటివరకు 8,514 ఫిర్యాదులు నమోదైనట్లు కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తం కోత విధించేలా కొత్త బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బిల్లులోని నిబంధనలు, ఆమోదం, అమలుపై అధికారిక వివరాలను నిర్ధారించుకోవడం అవసరం. వృద్ధుల సంరక్షణపై ఈ అంశం చర్చకు దారితీస్తోంది.
ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. తల్లిదండ్రులు తమ ఆకలిని చంపుకుని, తమ కడుపు కట్టుకుని ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తారు. చదివిస్తారు, ప్రయోజకుల్ని చేస్తారు. ఇంత చేసిన ఆ తల్లిదండ్రులకు కొడుకు లేదా కూతురు చివరికి ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? వృద్ధాశ్రమం. లేదంటే రోడ్డు పాలు. సమాజంలో ఎంతో గొప్పగా బతుకుతున్నాం అనుకుంటున్న నగరాల్లోనే… ఈరోజు తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నా కొడుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు బాబూ… నాకేమో తినడానికి తిండి లేదు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వృద్ధుల సంఖ్య తెలంగాణలో రోజురోజుకు పెరుగుతోంది. 2021 నుంచి ఇప్పటివరకు ఏకంగా 8,500 మందికి పైగా వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇకపై అలాంటి పిల్లల ఆటలు సాగవు. తల్లిదండ్రులను గాలికొదిలేస్తే… ఇక మీ జీతంలో నుంచే నేరుగా డబ్బులు కట్ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన చట్టాన్ని తెచ్చింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కొత్త చట్టం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. మన దేశంలో ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అంటాం. కానీ ఆచరణలో మాత్రం ఈ విలువలు రోజురోజుకూ మంటగలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న తాజా పోలీసు నివేదికలు, వార్తలు వింటే గుండె తరుక్కుపోతుంది. రాష్ట్రంలో 2021 నుంచి ఇప్పటివరకు వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో విస్మరణకు, వేధింపులకు గురవుతున్నారంటూ ఏకంగా 8,514 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులన్నీ ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ, సంక్షేమ చట్టం’ MWPSC Act కింద నమోదయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో భయకరమైన విషయం ఏంటంటే… ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం ఏప్రిల్ 2025 నుండి ఆగస్టు 2026 మధ్య కాలంలోనే, రెవెన్యూ డివిజనల్ అధికారుల ముందుకు దాదాపు 3,100 కేసులు వచ్చాయి. దీన్ని బట్టి వృద్ధులు మౌనంగా భరించడం మాని, తమ హక్కుల కోసం బయటికి వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. అయితే, ఫిర్యాదుల సంఖ్య పెరగడం ఒక ఎత్తైతే, అసలు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు పుట్టుకొస్తున్నాయనేది అసలు ప్రశ్న. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన నిజం ఏంటంటే… ఈ వేధింపులు పల్లెటూర్లలో కన్నా, చదువుకున్నా మనుషులు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే, ముఖ్యంగా ఐటీ కారిడార్లు, మహానగరాల చుట్టూ ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన ఈ కేసులను పరిశీలిస్తే… అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 1,078 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 989 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 912 కేసులు వెలుగు చూశాయి. చూసారా? ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో, ఎక్కడైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయో, ఎక్కడైతే విదేశాలకు వెళ్లే కొడుకులు కూతుర్లు ఉన్నారో… అక్కడే తల్లిదండ్రుల రోదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలు సంపాదించే కొడుకులకు, తమ కడుపు మాడ్చుకుని చదివించిన తల్లిదండ్రులకు పూటగడవడానికి తిండి పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. విదేశీ సంస్కృతికి అలవాటు పడి, వృద్ధులైన తల్లిదండ్రులను ‘ఒక బరువు’లా భావించి వృద్ధాశ్రమాల్లో పడేయడం లేదా ఇంట్లో నుంచి గెంటేయడం నిత్యకృత్యమైపోయింది. ఈ విపరీత ధోరణిని అరికట్టడానికి, కన్నవారికి అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్-2026’ ను ఆమోదించింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు వింటే… పిల్లల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం. అవేంటో వివరంగా చూద్దాం.. నెంబర్ వన్ జీతం నుండి నేరుగా కోత విధించడం. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా సరే… తమ వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, వారిపై ఫిర్యాదు అందితే… ఇకపై చూస్తూ ఊరుకోరు. ఆ ఉద్యోగి నెలవారీ జీతం నుండి 15% లేదా ₹10,000 ఇందులో ఏది తక్కువైతే అది నేరుగా కట్ చేస్తారు. ఆ మొత్తాన్ని నేరుగా ఆ వృద్ధ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, నేరుగా వారి జేబుకు చిల్లు పెట్టే నిబంధన. కన్నవారిని పోషించలేని వారికి ప్రభుత్వ, ప్రైవేట్ జీతాల్లో కోత తప్పదనే కఠినమైన సందేశాన్ని ఈ చట్టం ఇస్తోంది. నెంబర్ టు వేగవంతమైన పరిష్కారం. ఇంతకుముందు కోర్టుల చుట్టూ తిరగడం, సంవత్సరాల తరబడి కేసులు నలగడం జరిగేది. కానీ ఈ కొత్త చట్టం ప్రకారం… జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అప్పీలేట్ కమిషన్ల ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిశీలిస్తారు. వృద్ధులకు ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ న్యాయం చేకూరుస్తారు. కొంతమంది అనవచ్చు—’అరే, చట్టాలు తెచ్చినంత మాత్రాన మనుషుల మనసులు మారిపోతాయా? కుటుంబ గొడవలు చట్టాలతో పరిష్కారమవుతాయా? అని. కానీ ఆలోచించండి.. ప్రేమతో చేయాల్సిన బాధ్యతను కొందరు మర్చిపోయినప్పుడు, అక్కడ భయం పనిచేయాలి. మనం తల్లిదండ్రులను గాలికొదిలేస్తే, మన జీతంలో డబ్బులు కట్ అవుతాయి, సమాజంలో పరువు పోతుంది అనే భయం వల్లనైనా కొందరిలో మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ చట్టం వచ్చింది. ఇంట్లో రెండు కుక్కలను పెంచుకుంటూ వాటికి లక్షలు ఖర్చుపెట్టేవాళ్ళున్నారు, కానీ నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మందులు కొనివ్వడానికి చేతులు రాని కొడుకులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. చట్టాలు ఎన్ని వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు తెచ్చినా… మనిషిలో మానవత్వం చచ్చిపోతే ఏ చట్టం కూడా పూర్తిగా దాన్ని మార్చలేదు. అయితే, కనీసం చట్టం భయంతోనైనా తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే రోజులు రావాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో వేధింపులకు గురవుతుంటే, మౌనంగా ఉండకండి. వారికి అండగా నిలవండి, ప్రభుత్వ చట్టాల గురించి వారికి తెలియజేయండి. తల్లిదండ్రులు లేనిదే మనం లేము, వారి ఆశీస్సులు లేనిదే మన సంపాదనకు ఎలాంటి విలువ లేదే అనే విషయం మర్చిపోకండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ భారీ ఆఫర్. ముఖం మీదే తిరస్కరించి రోహిత్
హిందూ- ముస్లిం లవ్.. బిగ్ బాస్ నుంచి తమ బిడ్డను.. మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్
Amitabh Bachchan: గ్యాంగ్ స్టర్ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్
Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు
Bigg Boss Rohit: సడెన్ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

