Bigg Boss Rohit: సడెన్ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!
బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయనకు వారానికి రూ.70 వేల చొప్పున పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎనిమిది వారాలకు రూ.5.60 లక్షలు, అగ్నిపరీక్ష సీజన్ 2కు మరో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.6.10 లక్షలు అందినట్లు సమాచారం. అయితే ఈ పారితోషికంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్ అనూహ్యంగా బిగ్ బాస్ 10 నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది అతని అభిమానులనే కాకుండా బిగ్ బాస్ ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. టాప్ కంటెస్టెంట్లలో ఒకరు.. ఇంకా నిజం చెప్పాలంటే టైటిల్ రేసులో రోహిత్ కూడా ఉన్నాడనే అందరూ అనుకున్నారు. ఈక్రమంలోనే రోహిత్ ను ఎలిమినేట్ చేయడంతో అందరూ బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ తో పాటే హోస్ట్ నాగార్జునపై భగ్గుమంటున్నారు రోహిత్ ఫ్యాన్స్. వెంటనే అతనిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక కామనర్ గా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు రోహిత్. మొదట్లో బాగానే ఆకట్టుకున్నాడు. టాస్కుల్లో అదరగొట్టాడు. సూటిగా తన అభిప్రాయాలను చెప్పడంతో చాలా మంది రోహిత్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. సెలబ్రిటీలు కూడా ఇతడినే టార్గెట్ చేస్తూ నామినేషన్లు వేయడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న ముద్ర రోహిత్ పై పడిపోయింది. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోయింది. రోహిత్ ఆట తీరు చూస్తుంటే అతను కచ్చితంగా టాప్-5లో ఉంటారనుకున్నారు. కానీ పోనూ పోనూ రోహిత్ ఆట పూర్తిగా మారిపోయింది. హౌస్‌లో గొడవలతో ఎప్పటికప్పుడు బాగానే స్క్రీన్ పై కనిపించేవాడు గానీ టాస్కుల పరంగా పూర్ఇగా నిరాశపరిచాడు. దీనికి తోడు ఓవర్ యాటిట్యూడ్ చూపించడం. తోటి కంటెస్టెంట్లపై అనవసరంగా నోరు పారేసుకోవడం, షాలినితో గేమ్‌కి మించి క్లోజ్ అవ్వడం.. త్రిగుణ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం.. ఇలా రోహిత్ ఎలిమినేషన్ కు చాలా కారణాలే ఉన్నాయి. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ లో సుమారు ఎనిమిది వారాల పాట ఉన్నాడు రోహిత్. ఈ నేపథ్యంలో రోహిత్ పారితోషికం ఎంతన్నది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ హౌస్ కోసం గానూ రోహిత్ కు వారానికి రూ. 70 వేల పారితోషికం అందనుందట. ఈ లెక్కన మొత్తం 8 వారాలకు గానూ రూ.5.60 లక్షలతో పాటు అగ్నిపరీక్ష సీజన్ లో పాల్గొన్నందుకు అదనంగా రూ.50 వేలు మొత్తంగా రూ.6.10 లక్షలు రోహిత్ కు పారితోషికంగా దక్కినట్లు తెలుస్తోంది.అయితే ఈ రెమ్యునరేషన్ విషయంలోనూ రోహిత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ను విమర్శిస్తున్నారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ టాప్ రేటింగ్ తెచ్చుకోడానికి కారణమైన కంటెంస్టెంట్‌ను.. సడెన్‌గా బయటికి పంపించడమే కాదు.. రెమ్యునరేషన్ కూడా తక్కువ ఇస్తారా అంటూ మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు..
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

