Amitabh Bachchan: గ్యాంగ్ స్టర్ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన నివాసం జల్సా వద్ద భద్రతను పెంచుకున్నట్లు సమాచారం. ప్రతి ఆదివారం అభిమానులకు అభివాదం చేసే ఆయన, తాజాగా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ తెర వెనుక నుంచి కనిపించారు. జల్సాపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం, టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనతో ఈ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల వద్ద రెక్కీ జరిగినట్లు కూడా దర్యాప్తులో తేలిందని సమాచారం.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భద్రతను గణనీయంగా పెంచుకున్నారు. ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వెలుపల ప్రతి ఆదివారం అభిమానులకు అభివాదం చేయడం ఆయనకు అనవాయితీ. అయితే, తాజాగా ఆయన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్ వెనుక నుంచి కనిపించడం చర్చనీయాంశమైంది. అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపులు రావడం, మరోవైపు నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన జరగడంతో ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న ముంబై మేయర్‌కు అందిన ఈ-మెయిల్‌లో అమితాబ్ నివాసం ‘జల్సా’పై దాడి చేస్తామని దుండగులు హెచ్చరించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య ఈ దాడి జరగవచ్చని పేర్కొనడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు, జుహూ ప్రాంతంలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. దర్యాప్తులో భాగంగా నిందితులు.. అమితాబ్‌తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి సుమారు 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అమితాబ్ తన భద్రతపై కఠిన చర్యలు తీసుకున్నారు. సాధారణంగా అభిమానులకు నేరుగా కనిపించే ఆయన, ఇప్పుడు చక్రాలున్న పీఠం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేయించుకున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లు పోలీసుల సూచనల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్‌ను కమ్మేసిన ఈ భద్రతాపరమైన ఆందోళనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు
Bigg Boss Rohit: సడెన్ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు..
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

