కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.