ఇకపై తెలంగాణలో ఇన్‌స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పింఛన్లు పొందుతున్న భర్తలు మరణిస్తే, వారి భార్యలకు ఇకపై తక్షణమే పింఛన్ మంజూరు కానుంది. వృద్ధాప్య పింఛన్లతో పాటు ఇతర కేటగిరీలకూ దీన్ని విస్తరించారు. అర్హులు తమ గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్లు పొందుతున్న కుటుంబాలకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు చేయూత పింఛను పొందుతున్న భర్త మరణిస్తే, ఆయన భార్యకు పింఛను మంజూరు కావడానికి సమయం పట్టేది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, చేయూత పింఛనుదారు మరణిస్తే, ఆయన భార్యకు తక్షణమే పింఛను మంజూరు చేయాలని ఆదేశించింది. గతంలో ఈ విధానం కేవలం వృద్ధాప్య పింఛన్లకు మాత్రమే వర్తించేది. ఇప్పుడు దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, హెచ్ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితులు వంటి ఇతర కేటగిరీలకు కూడా దీనిని విస్తరించారు. భర్త మరణించిన సమయానికి భార్య వయస్సు 57 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వితంతు పింఛను, 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛను కింద ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మరణించిన భర్త ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిర్ణయంతో భర్తను కోల్పోయిన మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!
తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా?..‘జీతం కట్’ అంటోన్న తెలంగాణ సర్కారు
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ భారీ ఆఫర్. ముఖం మీదే తిరస్కరించి రోహిత్
హిందూ- ముస్లిం లవ్.. బిగ్ బాస్ నుంచి తమ బిడ్డను.. మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్
Amitabh Bachchan: గ్యాంగ్ స్టర్ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
