AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్..

Hyderabad: జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు
Hyderabad Traffic
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 9:31 PM

Share

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అవసరమైన చోట మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపులు:

1. NFCL నుంచి వచ్చే ట్రాఫిక్: శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ(ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 36 & 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లేవారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోగలరు. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

2. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 & 45 నుంచి వచ్చే ట్రాఫిక్: NFCL వైపు వెళ్లేవారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెం. 2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.

3. KCP, బంజారాహిల్స్ రోడ్ నెం. 1 నుంచి వచ్చేవారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవారు.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 వైపు వెళ్లవచ్చు.

4. మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చేవారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవారు.. విరించి హాస్పిటల్(1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 వైపు వెళ్లవచ్చు.

వాహనదారులకు సూచనలు:

• సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో(ఉదయం 8:30 – 11:00, సాయంత్రం 5:00 – 9:00) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

• ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులను అనుసరించండి.

• తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్(Google Maps మొదలైనవి) ఉపయోగించండి.

• ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా లేదా కార్ పూలింగ్(Car Pooling)కు ప్రాధాన్యత ఇవ్వండి.

• భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

పౌరులందరూ ఈ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

Follow Us