ఇందిరమ్మ బీమా పథకం వీరికే మాత్రమే.. రేవంత్ సర్కార్ కొత్త గైడ్‌లైన్స్.. ఎవరెవరు అర్హులంటే..?
Indiramma Bheema Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కుటుంబపెద్ద మరణిస్తే కుటుంసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు అతడి కుటుంబ ఆర్ధిక భద్రతకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ స్కీములో చేరేందుకు అర్హుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నమోదుకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరెవరు అర్హులనే విషయాలతో పాటు ఎలా నమోదు చేసుకోలనేది ఈ గైడ్‌లైన్స్‌లో పొందుపర్చింది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాల్లో లేనివారు మాత్రమే నమోదు చేసుకోవాలని సూచించింది. దాదాపు కోటి కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు నమోదు ప్రక్రియ జరగనుంది.
ఇందిరమ్మ జీవిత బీమా పథకం గైడ్ లైన్స్ ఇవిగో..
-మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే సమీపంలోని ఏదైనా నమోదు కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చు
-కుటుంబంలో ఒక్కరు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో ఆదాయం సంపాదిస్తున్నవారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
-ఎవరి పేరు మీద అయితే బీమా పొందాలనుకుంటున్నారో ఆ వ్యక్తి స్వయంగా రిజిస్ట్రేషన్ కేంద్రానికి వెళ్లి నామినీ వివరాలు అందించాలి
-ఇద్దరు నామినీల వివరాలు ఇస్తుంటే ఎవరికి ఎంత నిష్పత్తిలో నగదు ఇవ్వాలనేది పొందుపర్చాలి
-అనారోగ్యంతో శిబిరానికి రాలేనివాళ్లు లేదా దివ్యాంగుల కోసం శిబిరం ఇంచార్జ్ నేరుగా ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు
-వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి
-వయస్సుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు
-పుట్టిన తేదీలో తప్పుగా ఉంటే మీ ఆధార్‌లో అప్డేట్ చేయించుకున్న తర్వాత ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవాలి
-ప్రభుత్వ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, యాప్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది
-ఆధార్, రేషన్, మొబైల్ ఫోన్ తీసుకెళ్లాలి
-ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి
-రేషన్ కార్డుల్లోని వివరాలను ప్రభుత్వ వద్ద డేటాతో పోల్చి కుటుంబసభ్యుల వివరాలను నిర్దారిస్తారు
-నామినీ మైనర్ అయితే మేజర్ లేదా సంరక్షుడి వివరాలు ఇవ్వాలి
-భవిష్యత్తులో నామినీ మరణించినా లేదా నామినీని మార్చుకోవాలన్నా వెసులుబాటు ఉంటుంది
-రేషన్ కార్డు నెంబర్‌నే ఈ పధకం దరఖాస్తు సంఖ్యగా ఉంటుంది
-రేషన్ కార్డులకు కేవైసీ పూర్తి చేయనివారు ముందుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి
-పాలసీ ప్రారంభమైన దగ్గర నుంచి గడువు ముగిసే వరకు బీమా రక్షణ ఉంటుంది
-ప్రస్తుతం 58 ఏళ్ల వయస్సు ఉండి దరఖాస్తు చేసుకున్నా.. 59 ఏళ్ల వయస్సు వరకు బీమా వర్తిస్తుంది
