వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
జంతువులకు విశ్వాసం ఎక్కువని చెప్పేలా కర్ణాటకలో అద్భుతం జరిగింది. తనకు రోజూ అన్నం పెట్టిన 85 ఏళ్ల వృద్ధురాలు మరణించడంతో, ఒక కోతి ఆమె మృతదేహాన్ని గట్టిగా హత్తుకుని కన్నీరు పెట్టుకుంది. అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అంది. సోషల్ మీడియాలో ఈ హృదయ విదారక వీడియో వైరల్ అవుతోంది. మనుషులకు చేసిన మేలు మర్చిపోతారేమో కానీ, మూగజీవాలకు చూపే చిన్నపాటి ప్రేమను అవి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి.
వాటికి మాటలు రాకపోవచ్చు కానీ, వాటిలో ఉండే కృతజ్ఞతా భావం మనుషుల కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఈ వాస్తవాన్ని మరోసారి నిరూపించింది ఓ వానరం. తనకు ఏళ్ల తరబడి కడుపునిండా అన్నం పెట్టిన ఒక వృద్ధురాలి మరణాన్ని తట్టుకోలేక ఆ కోతి కన్నీరు పెట్టుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.కర్ణాటక రాష్ట్రం, రాయర దొడ్డి ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు పార్వతమ్మ వయోభారంతో అనారోగ్యానికి గురై సోమవారం కన్నుమూశారు. పార్వతమ్మకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. తన ఇంటి పరిసరాల్లోకి వచ్చే కోతులకు ఆమె రోజూ క్రమం తప్పకుండా ఆహారం పెడుతూ వాటి ఆలనా పాలనా చూసేవారు. చాలామంది కోతులను ఒక బెడదగా భావించి తరిమేస్తుంటే.. పార్వతమ్మ మాత్రం వాటిని తన సొంత బిడ్డల్లా, తోడుగా భావించి ప్రేమను పంచేవారు. ఆ వానరంతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది.పార్వతమ్మ మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు ఆమెకు తుది వీడ్కోలు పలికేందుకు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక కోతి అక్కడికి వచ్చింది. అది ఆహారం కోసం వెతకలేదు, జనాలను చూసి భయపడలేదు. ఎంతో ప్రశాంతంగా, మౌనంగా నడుచుకుంటూ వచ్చి పార్వతమ్మ మృతదేహం పక్కన కూర్చుంది.ఆ తర్వాత పార్వతమ్మ మృతదేహంపై పడి గట్టిగా హత్తుకుంది. తన తలను ఆమె తలకేసి ఆనించి కళ్లు మూసుకుని విలపించింది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

