పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోజూలాగే పొలానికి వెళ్లిన ఓ రైతు పొలం చదునుచేసే పనులు చేయిస్తున్నాడు. జేసీబీతో పొలం తవ్వుతుండగా.. దానికి ఓ మట్టికుండ తగిలింది. ఏమై ఉంటుందా అని చూసిన జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అశ్వాపురం మండలం బిజీ కొత్తూరులో వెలుగుచూసిన ఆ మట్టి కుండ ఇప్పుడు ఆ గ్రామంలో పెను సంచలనానికి తెరలేపింది.
బిజీ కొత్తూరులో ఓ రైతు పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తూ జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ పురాతన మట్టి కుండ బయటపడింది. ఆ కుండలో సుమారు 70 పురాతన నాణేలు ఉండటాన్ని గమనించిన అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు, గుట్టుచప్పుడు కాకుండా వాటిని చేజిక్కించుకున్నారు. అయితే, ఈ ‘గుప్తనిధి’ పంపకాల్లో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అవికాస్తా చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్యక్తి నుంచి రెండు నాణేలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇవి రాగితో చేసిన నాణేలని, 14వ శతాబ్దానికి చెందిన బహమనీ సుల్తానుల కాలం నాటివని గుర్తించారు. పురాతన చరిత్రకు సంబంధించిన ఈ విలువైన నాణేలు బయటపడటం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాణేలను పురావస్తు శాఖకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
డేట్లు మార్చుకుంటున్న టాప్ స్టార్స్
పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!
వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్
వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్
భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
అంతరిక్షంలో 'రమ్'వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
విమానం నుంచి చూస్తే 'భారత్-పాక్' సరిహద్దు ఎలా ఉందో తెలుసా?
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!

