AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్

వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్

Samatha J
|

Updated on: Apr 02, 2026 | 3:59 PM

Share

ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమా క్రెడిట్‌పై చర్చ మొదలైంది. నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌తో ఈ వివాదం మరింత రాజుకుంది. సినిమా విజయం వెనుక దర్శకుడితో పాటు స్టార్ హీరో పాత్ర కూడా ఉంటుందని, అందుకే క్రెడిట్ ఇద్దరికీ సమానంగా దక్కాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉండగానే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రాజమౌళి రికార్డు, మహేష్ బాబు ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమా విజయం సాధిస్తే దాని క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఒక నిర్మాత చేసిన ట్వీట్ కొత్త డిస్కషన్‌కు దారితీసింది. వారణాసి సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్‌ఎంబీ29 రివీల్ అయినప్పటి నుంచి, ఎస్ఎస్ఆర్13 అనే మరో హాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. నిర్మాత శోభు యార్లగడ్డ తన సోషల్ మీడియాలో సినిమా క్రెడిట్ ఎప్పుడూ దర్శకుడికే చెందుతుందని ప్రకటించారు. సినిమా పూర్తిగా దర్శకుడి ఆలోచన నుంచే పుడుతుందని, అందుకే ప్రాసెస్ క్రెడిట్ దర్శకుడికే ఇస్తారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

Published on: Apr 02, 2026 02:33 PM
Follow Us