ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నకిలీ సైనిక యూనిఫాంల సరఫరా నెట్‌వర్క్‌ను ఆర్మీ ఇంటెలిజెన్స్, రాజస్థాన్ పోలీసులు బట్టబయలు చేశారు. సుమారు 1,000 మీటర్ల అనధికారిక సైనిక కంబాట్ వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తు గత ఏడాది బరేలీలో పట్టుబడిన నకిలీ వస్త్రాల కేసుతో ముడిపడి ఉంది. దేశ భద్రతకు ముప్పు నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నకిలీ సైనిక యూనిఫాంల సరఫరా నెట్‌వర్క్‌ను అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఆర్మీ ఇంటెలిజెన్స్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 1,000 మీటర్ల అనధికారిక సైనిక కంబాట్ వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ దర్యాప్తు గత ఏడాది జూన్‌లో ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో పట్టుబడిన నకిలీ ఆర్మీ వస్త్రాలతో ప్రారంభమైంది. ఆర్మీ నిఘా వర్గాలు రహస్య విచారణలో శ్రీగంగానగర్‌లో నకిలీ యూనిఫామ్ తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించాయి. ఒక స్థానిక సంస్థ శ్రీగంగానగర్, లాల్‌గడ్, జట్టన్, సూరత్‌గఢ్ పరిసర మార్కెట్‌లలోని దుకాణాలకు ఈ వస్త్రాన్ని పంపిణీ చేస్తున్నట్లు తేలింది.నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జూలై 30న జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో సోదాలు నిర్వహించి, అక్రమ మెటీరియల్‌ను సీజ్ చేశారు. సైనిక వస్త్రాన్ని అనధికారికంగా కలిగి ఉండటం లేదా విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు సైనికుల్లా నటించి దేశ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉండటంతో సైన్యం, పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెట్‌వర్క్ ఇతర రాష్ట్రాలకు విస్తరించిందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం
ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..

