AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కాకర తీగ ఇంట్లో పెంచితే జీవితంలోనూ చేదు నింపుతుందా? వాస్తు నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

చాలామందికి ఇంటి ఆవరణలో లేదా మేడ మీద రకరకాల కూరగాయల మొక్కలను పెంచడం ఒక అలవాటు. తాజాగా పండిన కూరగాయలు ఆరోగ్యానికి మంచివని అందరూ భావిస్తారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని రకాల మొక్కలను ఇంటి లోపల లేదా ఇంటికి అతి సమీపంలో పెంచడం శుభప్రదం కాదని మీకు తెలుసా? ముఖ్యంగా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కాకరకాయ విషయంలో వాస్తు నిపుణులు కొన్ని సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు.

Vastu Tips: కాకర తీగ ఇంట్లో పెంచితే జీవితంలోనూ చేదు నింపుతుందా? వాస్తు నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
Vastu Tips For Home Plants
Bhavani
|

Updated on: Apr 04, 2026 | 7:21 PM

Share

మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? నిరంతరం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఉన్న కాకరకాయ తీగే అందుకు కారణం కావచ్చని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. కాకరకాయ ఆరోగ్యానికి తీపి కబురు అందించినా, వాస్తు పరంగా కొన్ని ప్రతికూలతలను తెచ్చిపెడుతుందట. అసలు కాకరకాయ తీగను ఎక్కడ నాటాలి? ఎక్కడ నాటకూడదు? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.

కాకరకాయ – ప్రతికూల శక్తికి మూలమా?

వాస్తు శాస్త్రం ప్రకారం, కాకరకాయ స్వతహాగా చేదు గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ చేదు స్వభావం వల్ల ఇది ఇంటి పరిసరాల్లో ప్రతికూల శక్తిని (Negative Energy) వెలువరిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లోని సభ్యుల మధ్య మనస్పర్థలు, కలహాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి లోపల లేదా డాబా మీద కాకర తీగలను పెంచడం వల్ల కుటుంబంలో శాంతి లోపిస్తుందని వాస్తు సలహాదారులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం మరియు లక్ష్మీ కోపం

కాకరకాయ తీగ ఇంటి లోపల ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో ధన స్థిరత్వం ఉండదు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా, ఆ డబ్బు అనవసర ఖర్చులకు నీళ్లలా ఖర్చయిపోతుంది. ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడి, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

గౌరవ మర్యాదలకు భంగం?

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకర తీగను నాటిన ఇంట్లోని సభ్యులకు సమాజంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది. అనేక చోట్ల అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది కేవలం ఆర్థిక స్థితిపైనే కాకుండా, వ్యక్తిగత ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.

ఎక్కడ నాటాలి? నిపుణుల సూచనలు:

ఒకవేళ మీరు కాకరకాయను పెంచాలనుకుంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించండి:

ఇంటి బయట: కాకర తీగలను ఎప్పుడూ ఇంటి లోపల లేదా బాల్కనీలో కాకుండా, ఇంటికి దూరంగా బయటి ఆవరణలో నాటాలి.

దిశ ముఖ్యం: కాకర తీగలను ఇంటికి దక్షిణ దిశలో (South) అస్సలు నాటకూడదు. ఇది అత్యంత అశుభ ఫలితాలను ఇస్తుంది.

మేడ మీద వద్దు: డాబా మీద లేదా ఇంటి పైకప్పుకు తాకేలా ఈ తీగలను పాకించకూడదు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వాస్తు జ్యోతిష్య పరమైన నమ్మకాలు వ్యక్తిగతమైనవి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వాస్తు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us