AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు, మానవ స్వభావాన్ని, జీవన సూత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మేధావి. ఆయన రచించిన చాణక్య నీతిలో సంపదను ఎలా కాపాడుకోవాలి. ఏ పనులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతామో వివరించారు. చాణక్య నీతి ఆధారంగా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని, గౌరవాన్ని తగ్గించే కొన్ని అలవాట్ల గురించి ఇక్కడ వివరించబడింది. ఆచార్య చాణక్యుడి ప్రకారం, లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని పద్ధతులకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..

మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
Chanakya Niti Money Tips
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2026 | 12:49 PM

Share

ఆచార్య చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం, ఒక వ్యక్తి ఎంత సంపాదించినా కొన్ని దురలవాట్ల వల్ల పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉంది. చాణక్యుడి ప్రకారం, లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని పద్ధతులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా శుభ్రత లేకపోవడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది. మురికి బట్టలు ధరించే వారు, దంతాలను శుభ్రం చేసుకోని వారి దగ్గర లక్ష్మీ దేవి నిలవదని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇలాంటివి మరిన్ని నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం..

ఒక వ్యక్తి ఆర్థిక పతనానికి కారణమయ్యే 5 ప్రధాన అలవాట్లు:

అపరిశుభ్రత: ఎవరైతే మురికి బట్టలు ధరిస్తారో, వారిని దరిద్రం వెన్నాడుతుందని చాణక్యుడు చెప్పాడు. శుభ్రత లేని చోట లక్ష్మీ దేవి నివసించదు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నోటి దురుసు (కఠినమైన మాటలు): మాట్లాడే తీరు ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇతరులను కించపరుస్తూ, పరుష పదజాలంతో మాట్లాడే వారికి ఎంతటి ఐశ్వర్యం ఉన్నా అది త్వరలోనే అంతమైపోతుంది. మంచి మాట తీరు ఉన్నవారికి కష్టకాలంలో కూడా ఇతరుల సహాయం అందుతుంది.

దంతాల శుభ్రత: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దంతాలను క్రమంగా శుభ్రం చేసుకోని వారిపై లక్ష్మీ దేవికి కోపం వస్తుందని చాణక్యుడు అంటారు. నోటి ఆరోగ్యం సరిగ్గా లేని వారు సోమరితనానికి లోనవుతారు. ఇది వారి పనితీరుపై ప్రభావం చూపుతుంది.

అతిగా తినడం: ఆకలి కంటే ఎక్కువగా తినే వ్యక్తి ఎప్పుడూ అనారోగ్యంతో, బద్ధకంతో ఉంటాడు. దీనివల్ల ఆర్థిక వనరులు వృధా అవ్వడమే కాకుండా, కష్టపడి పనిచేసే శక్తి తగ్గుతుంది. మితాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం, సంపద రెండూ సిద్ధిస్తాయి.

సూర్యోదయం తర్వాత నిద్ర: సూర్యోదయానికి ముందే నిద్రలేవడం విజేతల లక్షణం. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోయే వారు తమ జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతారు. సోమరితనం అనేది దారిద్రానికి మొదటి మెట్టు అని చాణక్యుడు హెచ్చరించాడు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, మన వ్యక్తిత్వాన్ని, అలవాట్లను మెరుగుపరుచుకోవడం కూడా అంతే ముఖ్యం. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని, మనశ్శాంతిని పొందవచ్చని చాణక్య నీతి సారాంశం.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత