AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి..

పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం సాధారణంగా కనిపించినా, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది జింజివైటిస్, పీరియాడోంటైటిస్, విటమిన్ సి లేదా విటమిన్ కె లోపం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సరైన నోటి పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం, అవసరమైతే దంతవైద్యుడిని సంప్రదించడం ద్వారా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి..
Gums Bleed While Brushing
Srilakshmi C
|

Updated on: Aug 04, 2026 | 9:04 PM

Share

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం కేవలం నోటి పరిశుభ్రత లోపానికే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. చిగుళ్లు పళ్లను గట్టిగా పట్టి ఉంచే కీలకమైన భాగం. అవి ఆరోగ్యంగా ఉంటేనే పళ్లు ఎక్కువ కాలం బలంగా ఉంటాయి. అందుకే చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ప్రధాన కారణాలు జింజివైటిస్ (Gingivitis)

చిగుళ్ల వ్యాధుల ప్రారంభ దశను జింజివైటిస్ అంటారు. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల పళ్లపై ప్లాక్ పేరుకుపోయి చిగుళ్లలో వాపు ఏర్పడుతుంది. బ్రష్ చేస్తున్నప్పుడు రక్తస్రావం, చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు, నోటి దుర్వాసన దీని లక్షణాలు.

పీరియాడోంటైటిస్ (Periodontitis)

జింజివైటిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది పీరియాడోంటైటిస్‌గా మారుతుంది. ఈ దశలో చిగుళ్లు, పళ్ల మధ్య ఖాళీలు ఏర్పడి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది పళ్లను పట్టి ఉంచే ఎముకలు, కణజాలాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. చిగుళ్ల నుంచి చీము రావడం, పళ్లు వదులుగా మారడం, పళ్లు ఊడిపోవడం, చిగుళ్లు పళ్ల నుంచి వెనక్కి జరగడం, చిగుళ్ల నుంచి రక్తం రావడానికి ఇతర కారణాలు, నోటి పరిశుభ్రత లోపించడం, పళ్లపై ప్లాక్, టార్టార్ పేరుకుపోవడం, విటమిన్ సి, విటమిన్ కె లోపం, మధుమేహం, ధూమపానం, పొగాకు, గుట్కా వాడకం, గట్టిగా బ్రష్ చేయడం దీని లక్షణాలు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు దంతవైద్యుడిని సంప్రదించాలి?

ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా దంతవైద్యుడిని సంప్రదించండి.

  • కొన్ని రోజులుగా రక్తస్రావం ఆగకపోవడం
  • చిగుళ్లలో తీవ్రమైన నొప్పి లేదా వాపు
  • తగ్గని నోటి దుర్వాసన
  • చిగుళ్ల నుంచి చీము రావడం
  • పళ్లు కదులుతున్నట్లు అనిపించడం
  • ప్రతిసారి బ్రష్ లేదా ఫ్లాస్ చేసినప్పుడు అధిక రక్తస్రావం
  • చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే…
  • రోజుకు కనీసం రెండుసార్లు మృదువైన బ్రష్‌తో పళ్లు తోముకోవాలి.
  • ప్రతిరోజూ డెంటల్ ఫ్లాస్ ఉపయోగించాలి.
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్‌బ్రష్ మార్చాలి.
  • పొగాకు, గుట్కా, ధూమపానానికి దూరంగా ఉండాలి.
  • చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి.
  • ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవాలి.
  • విటమిన్ లోపం కూడా కారణమే

నిపుణుల ప్రకారం, విటమిన్ సి మరియు విటమిన్ కె లోపం ఉన్నప్పుడు కూడా చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగవచ్చు.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు

  • నారింజ
  • ఉసిరికాయ
  • నిమ్మకాయ
  • జామపండు
  • క్యాప్సికమ్
  • విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు
  • పాలకూర
  • మెంతికూర
  • బ్రోకలీ
  • ఇతర ఆకుకూరలు

ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం చిన్న సమస్య కాదని గుర్తుంచుకోవాలి. ఇది జింజివైటిస్, పీరియాడోంటైటిస్, విటమిన్ లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతం కావచ్చు. సరైన నోటి పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం ద్వారా చిగుళ్ల సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.

Follow Us