4 నెలల ముందే మొదలైన సంక్రాంతి మ్యూజిక్.. అస్సలు ఆపట్లేదుగా..
సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ ఈసారి నాలుగు నెలల ముందే మొదలయ్యాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబో మూవీకి అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అంటూ ప్రమోషనల్ హంగామా మొదలుపెట్టారు. శర్వానంద్, శ్రీను వైట్ల సినిమా కూడా ఓపెనింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి-బాబీ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా సంక్రాంతి బరిలోకి సిద్ధమవుతోంది. దీంతో పండగ పోటీపై ఆసక్తి పెరుగుతోంది.
సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్‌తో అప్‌డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్‌డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా అప్‌డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్‌పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్

