పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల
లోన్, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను వాట్సాప్‌లో పంపడం ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవతలి వ్యక్తి ఫోన్ లేదా అకౌంట్ హ్యాక్ అయితే సున్నితమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా సెక్యూర్ పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అవసరమైతే మాస్క్డ్ ఆధార్, వాటర్‌మార్క్, పాస్‌వర్డ్ రక్షిత పీడీఎఫ్ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలి.
ఇది డిజిటల్ యుగం.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసేంజర్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని.. ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే, మీకొక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా.. నేడు ‘కేవైసీ’ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. “ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి?” అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్లే. మీ ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్నే తలక్రిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించని తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్‌లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే, అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్‌లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్‌లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్‌ను తన ఫోన్ గ్యాలరీలోకి, లాప్‌టాప్‌లోకి లేదా కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఆ ఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటే, మీ పత్రాల కాపీలు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే, దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే! ఆ ఏజెంట్ లేదా సంస్థ ఉద్యోగి ఉద్యోగం మారొచ్చు, లేదా తన ఫోన్ పోగొట్టుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి ఫోన్ లేదా వాట్సాప్ అకౌంట్ గనుక హ్యాక్ అయితే, మీరు గతంలో పంపిన ఆ పాన్ కార్డ్, ఆధార్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి సులభంగా వెళ్ళిపోతాయి. దీనివల్ల మీ పేరు మీద నకిలీ సిమ్ కార్డులు తీసుకోవడం, ఫేక్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, లేదా మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద ఆన్‌లైన్ లోన్లు తీసుకోవడం లాంటి భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. చాలా మంది చిన్న వ్యాపారులు, ప్రాపర్టీ బ్రోకర్లు, లోన్ ఏజెంట్లు కంపెనీ ఇచ్చిన సెక్యూర్ సిస్టమ్స్ వాడరు. తమ సొంత పర్సనల్ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే కస్టమర్ల డాక్యుమెంట్లు సేకరిస్తుంటారు. ఇలాంటి పర్సనల్ ఫోన్లలో కనీస సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు ఉండవు. దాంతో మీ సున్నితమైన సమాచారం సులభంగా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మీ నెలవారీ ఆదాయం, మీరు చేసే ఖర్చులు, మీ అకౌంట్ బ్యాలెన్స్ అన్నీ క్లియర్ ఉంటాయి. ఈ డేటా గనుక థర్డ్-పార్టీ టెలికాలర్లు లేదా మోసగాళ్ల చేతికి చిక్కితే, మీకు నిత్యం లోన్ ఆఫర్లు, ఫేక్ లాటరీ కాల్స్, ఫిషింగ్ లింక్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చి పడతాయి. మన దేశంలో డేటా భద్రతను కాపాడటానికి ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి నుంచి వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారంటే, దానికి స్పష్టమైన అనుమతి ఉండాలి. ఆ డేటా సేకరణ వెనుక ఒక నిర్దిష్టమైన, చట్టబద్ధమైన ఉద్దేశం ఉండాలి. కానీ, ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా లోన్ ఏజెంట్ తన సొంత పర్సనల్ వాట్సాప్ నంబర్ ద్వారా కస్టమర్ల కేవైసీ పత్రాలు సేకరించడం అనేది ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇది చట్టరీత్యా నేరం కిందకే వస్తుంది. సంస్థలు అధికారిక సిస్టమ్స్ ద్వారానే డేటాను సేకరించాలి తప్ప, ఇలా ఇష్టానుసారంగా వాట్సాప్‌లో సేకరించకూడదు. సరే, మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు లోన్లు, క్రెడిట్ కార్డులు లేదా హోటల్ బుకింగ్స్ మానేయగలమా? ఖచ్చితంగా మానేయలేం. మరి ఈ పనులను సురక్షితంగా ఎలా పూర్తి చేయాలి? ఇక్కడ కొన్ని గోల్డెన్ టిప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి: ఎవరైనా మీ కేవైసీ డాక్యుమెంట్లు అడిగితే వాట్సాప్‌లో పంపమని అస్సలు ఒప్పుకోకండి. ఆ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్, అఫిషియల్ యాప్ లేదా సెక్యూర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ లింక్ ఉంటేనే దాని ద్వారా మాత్రమే మీ పత్రాలను అప్‌లోడ్ చేయండి. ప్రభుత్వం అధికారికంగా అందించిన డిజిలాకర్ యాప్ ద్వారా మీ డాక్యుమెంట్లను నేరుగా షేర్ చేయవచ్చు. దీనివల్ల మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరి చేతికి వెళ్లవు, కేవలం వెరిఫికేషన్ మాత్రమే పూర్తవుతుంది. అలాగే యూఐడీఏఐ అందించే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ విధానాలను వాడటం చాలా సురక్షితం. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ కాపీని ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే, మీ పూర్తి ఆధార్ నంబర్ కనిపించేలా ఇవ్వకండి. ఆధార్ వెబ్‌సైట్ నుంచి కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్‌డ్ ఆధార్’ కాపీని డౌన్‌లోడ్ చేసి దానిని మాత్రమే వాడండి. మీరు ఏ డాక్యుమెంట్ పంపాల్సి వచ్చినా సరే, దానిపై స్పష్టంగా వాటర్ మార్క్ వేయండి. ఉదాహరణకు.. ‘For Hotel Check In Only’ లేదా ‘For Loan Application Only’ అని రాసి, ఆ ప్రయోజనం కోసం మాత్రమే అది వాడేలా చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్ రూపంలో పంపాల్సి వస్తే, ఆ ఫైల్‌కు బలమైన పాస్‌వర్డ్ పెట్టండి. ఆ పాస్‌వర్డ్‌ను వాట్సాప్‌లో కాకుండా వేరే మాధ్యమం ద్వారా అంటే పర్సనల్ కాల్ లేదా వేరే యాప్ ద్వారా మాత్రమే అవతలి వ్యక్తికి తెలియజేయండి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అనేవి కేవలం కాగితాలు కావు.. అవి మీ ఆర్థిక, వ్యక్తిగత గుర్తింపుకు ప్రతీకలు. అలాంటి విలువైన పత్రాలను ఎవరికీ పడితే వారికి, కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పంపేయకండి. ఇకపై ఎవరైనా వాట్సాప్‌లో మీ డాక్యుమెంట్లు అడిగితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. వారికి కంపెనీ అధికారిక లింక్ లేదా సెక్యూర్ పోర్టల్ అడగండి. వీలైనంత వరకు సురక్షితమైన పద్ధతులనే పాటించండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్

