AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

Phani CH
|

Updated on: Aug 22, 2026 | 6:42 PM

Share

బయటికి ఆరోగ్యంగా కనిపించినా శరీరంలో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి12 లోపాలు నిశ్శబ్దంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలసట, ఏకాగ్రత తగ్గడం, జుట్టు రాలడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిరంతరం అలసటగా ఉంటే సొంతంగా సప్లిమెంట్లు వాడకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

బయటికి ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించే చాలామందిలో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి12 లోపాలు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలను చూపించవు. రోజువారీ పనులు చేసుకుంటూ, వ్యాయామం చేసేవారిలో కూడా ఈ లోపాలు నిశ్శబ్దంగా ప్రభావం చూపుతుంటాయంటున్నారు. నగర జీవనశైలిలో ఎండ తగలకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందంటున్నారు. నిపుణుల ప్రకారం.. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తంలో ఆక్సిజన్‌ను అందించే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. విటమిన్ బి12 నరాల ఆరోగ్యానికి, ఎర్ర రక్త కణాల తయారీకి ఎంతో అవసరం. అలాగే విటమిన్ డి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఈ పోషకాలు తగ్గితే శరీరం కొంతకాలం సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే కాలక్రమేణా కారణం తెలియని అలసట, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, జుట్టు రాలడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైతే రక్తహీనత లేదా నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఏ సమస్య కనిపించినా సొంతంగా మందులు లేదా సప్లిమెంట్లు వాడటం అస్సలు మంచిది కాదు. అధిక మోతాదులో ఐరన్ తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిరంతరం అలసటగా ఉన్నవారు వైద్యులను సంప్రదించి సీబీసీ, ఫెరిటిన్, విటమిన్ డి మరియు బి12 వంటి సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. పరీక్షల ద్వారా లోపం నిర్ధారణ అయిన తర్వాత, డాక్టర్ల సలహా మేరకు సరైన ఆహారపు మార్పులు లేదా తగిన సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ పోషక లోపాలను సులభంగా సరిదిద్దుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Follow Us