AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు కొనే జీడిపప్పు అసలైనదేనా.. కల్తీ కాజును సెకన్లలో ఇలా కనిపెట్టండి..

పాయసమైనా, స్వీటైనా జీడిపప్పు పడితే ఆ రుచే వేరు.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎంతో ఇష్టంగా కాజు కొంటున్నారా? అయితే మీరు కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. అధిక డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మార్కెట్లోకి ప్రమాదకరమైన కెమికల్స్‌తో పాలిష్ చేసిన నకిలీ జీడిపప్పు భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో అసలైన, నాణ్యమైన జీడిపప్పును ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

Krishna S
|

Updated on: Aug 22, 2026 | 7:28 PM

Share
జీడిపప్పు కొనే సమయంలో దాని రంగు, మెరుపును గమనించడం ద్వారా నాణ్యతను తేలిగ్గా గుర్తించవచ్చు. సహజమైన, అసలైన జీడిపప్పు ఎప్పుడూ కాస్త ఆఫ్ వైట్ లేదా లేత క్రీమ్ రంగులో ఉంటుంది. దానికి విపరీతమైన మెరుపు ఉండదు. ఒకవేళ జీడిపప్పు మరీ తెల్లగా, విపరీతమైన పాలిష్ మెరుపుతో కనిపిస్తే.. అది కెమికల్స్‌తో పాలిష్ చేసిన నకిలీ కాజుగా అనుమానించాల్సిందే.

1 / 5
జీడిపప్పు నాణ్యతను తెలుసుకోవడానికి కొనే ముందే దాన్ని మధ్యలోకి విరిచి చూడాలి. స్వచ్ఛమైన జీడిపప్పును విరిచినప్పుడు లోపల కూడా సమానమైన ఆకృతి, లేత క్రీమ్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది. అదే కల్తీ లేదా నాసిరకం జీడిపప్పు అయితే లోపలి భాగం పసుపు రంగులో ఉండటమే కాకుండా మచ్చలు, రంధ్రాలు లేదా పురుగులు పట్టిన ఆనవాళ్లు కనిపిస్తాయి.

2 / 5
జీడిపప్పు రుచిని బట్టి కూడా అసలైనదా కాదా అని గుర్తించవచ్చు. కొనే సమయంలో ఒకటి నోట్లో వేసుకుని తిన్నప్పుడు.. అది పంటికి అంటుకోకుండా సులభంగా నమలడానికి వీలుగా ఉండాలి. సహజమైన జీడిపప్పు తింటున్నప్పుడు తేలికపాటి స్వీట్, సహజ నూనె రుచి వస్తుంది. అదే నకిలీ లేదా పాడైపోయిన జీడిపప్పు అయితే పంటికి జిగురుగా అతుక్కోవడమే కాకుండా రుచి చేదుగా, వగరుగా ఉంటుంది.

3 / 5
నాణ్యమైన జీడిపప్పుపై ఎలాంటి నల్లటి లేదా బూడిద రంగు మచ్చలు ఉండవు. పైభాగం గరుకుగా కాకుండా సాఫ్ట్‌గా ఉండాలి. మార్కెట్లో కొనే సమయంలో జీడిపప్పుపై ఏవైనా చిన్న చిన్న రంధ్రాలు, మచ్చలు ఉంటే వాటిని పక్కన పెట్టడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాటిలో ఫంగస్ లేదా పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

4 / 5
వాసన చూడటం ద్వారా కూడా స్వచ్ఛతను పసిగట్టొచ్చు. అసలైన జీడిపప్పు నుంచి సహజసిద్ధమైన నట్స్ వాసన వస్తుంది. అదే కెమికల్స్‌తో పాలిష్ చేసిన లేదా రసాయనాలలో ప్రాసెస్ చేసిన నకిలీ జీడిపప్పు నుంచి ఘాటైన వాసన, విచిత్రమైన రసాయనాల దుర్వాసన వస్తుంది. కాబట్టి మార్కెట్లో కాజు కొనేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు పాటించి నకిలీ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
మీరు కొనే జీడిపప్పు అసలైనదేనా.. కల్తీ కాజును సెకన్లలో ఇలా..

మెదడుకు ఈ డ్రై ఫ్రూట్ సూపర్ ఫుడ్ అంటున్నారు.. రోజుకు 2-3 చాలు!

టైల్స్ మధ్య పేరుకుపోయిన మురికిని వదిలించాలా? సింపుల్ చిట్కాలు

పిజ్జా తినాలనిపిస్తోందా? మైదా వద్దు.. రవ్వతో ఇలా చేసేయండి!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‏లకు ఆమె లక్కీ హీరోయిన్..

వంటింట్లో ఉండే బేకింగ్ సోడా.. ఇన్ని పనులు చేస్తుందా?

వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి: గంభీర్

2027లో ఎండలు కాదు.. ఏకంగా అగ్ని వర్షమే! 'ఎల్ నినో' వార్నింగ్

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో తెలంగాణ భాగస్వామ్యం..!

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ..