కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు..!
ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శ్రీచైతన్య స్కూల్ బస్సు తారకరామ కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

