జీతం వచ్చిన వెంటనే అయిపోతుందా? ఈ చిట్కాలు మీకోసం

Samatha

22 August 2026

చాలా మంది నెలంత కష్టపడి జీతం సంపాదిస్తుంటారు. కానీ చాలా మంది వచ్చిన జీతం మిగలక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

చిన్న చిన్న ఖర్చులు వలన వచ్చిన జీతం వచ్చినట్లే అయిపోతుంది. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏం అర్థం కాకుండా ఉండిపోతారు.

అందుకే ఇప్పుడు మనం వచ్చిన జీతం వెంటనే అయిపోకుండా ఉండటానికి ఎలాంటి పొదుపు మంత్రం పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

50-30-20 రూల్ పాటించాలి. అప్పుడే మీరు పొందే జీతం మీకు మిగులుతుంది. అందులో 50 శాతం ఇంటి రెంట్, కరెంట్ బిల్లుకు చెందుతుంది.

అంతే కాకుండా 30 శాతం మీరు సినిమాకి వెళ్లడం షాపింగ్ వెళ్లడం, ఒక వేళ ఇవి లేని సమయంలో మీ ఇంటిలో , చుట్టాల్లో జరిగే ఫంక్షన్స్‌కు ఖర్చు పెట్టుకోవాలి.

మిగితా 20 శాతం పొదుపు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా 20 శాతం పొదుపు చేసుకున్నప్పుడే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు.

చాలా మంది ఎక్కువగా డీ మార్ట్‌కు వెళ్లి పెట్టేదాని కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అందువలన మీరు వెళ్లడానికి ముందే మీకు కావాల్సిన సామాను పేపర్ పై రాసుకొని వెళ్లాలి.

అంతే కాకుండా యూపీ ఐ వాటికి ఒక రోజుకు ఇంత ఖర్చు పెట్టాలనే లిమిట్ పెట్టుకోండి. దీని వలన మీరు ఎక్కువ ఖర్చుచేస్తున్నారనే అలర్ట్ వస్తుంది.