సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తాండాలో ఏకాంతంగా గడపాలని అటవీ ప్రాంతానికి వెళ్లిన ప్రేమ జంటకు ఊహించని ప్రమాదం ఎదురైంది. కరెంట్ తీగలు పడటంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. యువతి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.