హైదరాబాద్లోని 400 ఏళ్లనాటి గోల్కొండ కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో జరిగిన అక్రమ తవ్వకాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ తవ్వకాల్లో ఓ రహస్య సొరంగం వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ చొరవతో ఏఎస్ఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.