AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirai: రిలీజ్‌కు ముందే జపాన్‌లో రికార్డులు సృష్టిస్తున్న మిరాయ్

Mirai: రిలీజ్‌కు ముందే జపాన్‌లో రికార్డులు సృష్టిస్తున్న మిరాయ్

Phani CH
|

Updated on: Aug 22, 2026 | 7:42 PM

Share

‘హనుమాన్’తో పాన్‌ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ‘మిరాయ్‌’తో అంతర్జాతీయ మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. ఆగస్టు 21న జపాన్‌లో విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో టాప్ 10 ఇండియన్ సినిమాల్లో చోటు సంపాదించింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవర, సలార్ వంటి చిత్రాల సరసన నిలిచిన ‘మిరాయ్‌’, జపాన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

మన కుర్ర హీరోలు రూటు మారుస్తున్నారు. ఒక హిట్ కొట్టగానే ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకోకుండా, వెంటనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అంతే కాదు, తమ మార్కెట్‌ను ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో యంగ్ హీరో తేజ సజ్జా మిగతా వాళ్ల కంటే రెండు అడుగులు ముందే ఉన్నాడు. ఇండియాలో సూపర్ హిట్ అయిన మిరాయ్ సినిమాతో ఇప్పుడు ఓవర్‌సీస్‌ లెక్కలు మార్చేస్తున్నారు ఈ యంగ్‌ హీరో. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేసిన తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా, ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ మీద కన్నేసింది. ఆగస్టు 21న జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో నయా రికార్డ్స్ సెట్ చేస్తోంది. మిరాయ్ కేవలం డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలతోనే జపాన్‌లోని టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఎంటరైపోయింది. ఇప్పటి వరకు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవర, సలార్ లాంటి భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పుడు ఆ ఎలైట్ లిస్ట్‌లో మిరాయ్ కూడా చేరిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై రికార్డులను సైతం క్రాస్ చేసే దిశగా దూసుకుపోతోంది మిరాయ్‌. అసలు జపాన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటన్న విషయంలో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిరాయ్ అంటే జపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. అందుకే ఆ టైటిల్ వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి తోడు అశోక చక్రవర్తి దాచిన 9 రహస్య గ్రంథాల కాన్సెప్ట్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్, మన మైథాలజీ టచ్ జపనీస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జపాన్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో సత్తా చాటుతూనే, మరోవైపు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘మిరాయ్ 2’ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేశారు తేజ. ఇలా టైమ్ వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్‌తో సినిమాలు రిలీజ్ చేయడం వల్లే ఈ యంగ్ హీరోకు ఇంత వేగంగా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరి రిలీజ్‌కు ముందే జపాన్‌ను షేక్ చేసిన ఈ సూపర్ యోధ.. ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Follow Us