Prabhas: నాలుగు సినిమాలున్నా తగ్గని ప్రభాస్ స్పీడ్..
ప్రభాస్ చేతిలో ఇప్పటికే ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ‘ఫౌజీ’ కథలోని డెప్త్ కారణంగా దానికి ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదిప్పుడు.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారీయన. చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులుండగానే.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఓ దర్శకుడి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమాకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తుంది. మరి లొకేషన్‌లోనే ప్రభాస్‌ను అంతగా మెప్పించిన ఆ దర్శకుడెవరో తెలుసా..? ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ చివరి దశకు వచ్చేసింది.. కల్కి 2 ప్రభాస్ లేకుండానే షూట్ నడుస్తుంది.. స్పిరిట్‌కు నాన్ స్టాప్ డేట్స్ ఇచ్చారు.. సలార్ 2 వచ్చే ఏడాది షురూ కానుంది. ఇవన్నీ పూర్తి కావడానికే కనీసం మరో రెండేళ్ల టైమ్ పడుతుంది. ఇంత బిజీగా ఉన్నా.. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో కొత్త సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఆ కొత్త సినిమా మరెవరితోనో కాదు.. హను రాఘవపూడితోనే..! ఫౌజీ సెట్స్‌పై ఉండగానే హను టేకింగ్, వర్కింగ్ స్టైల్ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఫౌజీ కథలో ఉన్న డెప్త్ చూశాక.. ప్రీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వతంత్య్రానికి పూర్వం జరిగే పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీగా ఫౌజీ వస్తుంది.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ప్రీక్వెల్ కోసం సలార్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ రెడీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ 2 కూడా చేయబోతున్న ఈ నిర్మాణ సంస్థ.. ఫౌజీ ప్రీక్వెల్ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించడానికి ఆసక్తి చూపిస్తోంది. హోంబలే సంస్థతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ కుదిరితే చేతిలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 పూర్తయిన వెంటనే మళ్లీ హనుతో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా కనిపిస్తుంది. గతంలో పూరీ జగన్నాథ్, రాజమౌళి లాంటి దర్శకులకు ఇలాగే గ్యాప్ లేకుండా ఛాన్సిచ్చారు ప్రభాస్. ఆ లిస్టులోకి హను చేరతారేమో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

