AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: ఏడుగురు దర్శకులు.. ఏడు సినిమాలు.. మోహన్‌లాల్ స్పీడ్‌కు షాకవుతున్న ఇండియన్ సినిమా!

Mohanlal: ఏడుగురు దర్శకులు.. ఏడు సినిమాలు.. మోహన్‌లాల్ స్పీడ్‌కు షాకవుతున్న ఇండియన్ సినిమా!

Phani CH
|

Updated on: Aug 22, 2026 | 8:07 PM

Share

మాలీవుడ్‌ సీనియర్ హీరో మోహన్‌లాల్ తన స్పీడ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకేసారి ఏడు కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన ఆయన, ప్రియదర్శన్, సత్యన్ అంతిక్కాడ్, జీతూ జోసెఫ్, జూడ్ ఆంథనీ జోసెఫ్ సహా పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నారు. యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్ దర్శకులకు అవకాశం కల్పిస్తూ ఆయన రూపొందించిన లైనప్ ఇప్పుడు మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో ఈ సినిమాల వివరాలు వెల్లడికానున్నాయి.

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల టైమ్ తీసుకుంటున్నారు. కానీ మాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం మూవీ మేకింగ్ స్పీడ్‌లో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. తాజాగా కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఒకేసారి ఏడు ప్రాజెక్ట్‌లను ప్రకటించి షాక్ ఇచ్చారు. మరి మోహన్‌లాల్ లైనప్ ఏంటి ఈ సీనియర్స్ స్పీడ్ వెనకున్న సీక్రెట్ ఏంటి? మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం జోరు తగ్గకుండా ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆయన స్పీడ్‌ను మ్యాచ్ చేసేలా మరో లెజెండరీ హీరో మోహన్‌లాల్ కూడా తన లైనప్‌ను లాక్ చేశారు. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఆయన ఇచ్చిన అప్‌డేట్ చూసి.. మాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమానే షాక్ అవుతోంది. ఏకంగా ఏడుగురు డైరెక్టర్ల పేర్లను ఒకేసారి అనౌన్స్ చేశారు లాలెటన్‌. ఎగ్జైటింగ్ స్టోరీస్.. ఎగ్జైటింగ్ జర్నీస్.. అండ్ వెరీ స్పెషల్ ఫిల్మ్‌మేకర్స్ అంటూ మోహన్‌లాల్ తన ఏడు ప్రాజెక్టుల డైరెక్టర్ల పేర్లను రివీల్ చేశారు. ఇందులో సీనియర్ డైరెక్టర్స్ ప్రియదర్శన్, సత్యన్ అంతిక్కాడ్‌తో పాటు.. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్, 2018 ఫేమ్ జూడ్ ఆంథనీ జోసెఫ్ ఉన్నారు. అలాగే విష్ణు మోహన్, అనూప్ సత్యన్, దిలీష్ పోతన్ లాంటి వాళ్లు కూడా మోహన్‌లాల్‌ లైనప్‌లో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ మోహన్‌లాల్ సెట్ చేసుకున్న ఈ లైనప్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అనౌన్స్‌మెంట్‌ చూస్తుంటే మాలీవుడ్ సీనియర్ హీరోల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఇతర ఇండస్ట్రీల స్టార్స్ ఏళ్ల తరబడి ఒకే సినిమాకి కమిట్ అవుతుంటే.. కేరళ స్టార్స్ మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో చకచకా సినిమాలు పూర్తిచేస్తున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన ఏడు సినిమాల క్యాస్టింగ్, రిలీజ్ డేట్స్ ఇంకా బయటికి రాకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ లైనప్‌ సాలిడ్ ఇంపాక్ట్ చూపించడం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Follow Us