AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృత్రిమ మేథ కాదు.. కృత్రిమ క్షోభ.. గ్లోబు నెత్తిన AI గుదిబండ.. దించేదెలా?

చారాణా కోడికి బారానా మసాలా అంటారే అదే అవుతోంది ఇక్కడ..! మనకు పావలా సౌకర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి రూపాయి నష్టాన్ని మిగులుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆ నష్టంలో కనిపించే నష్టం కొంతే అయినా, కనిపించని నష్టం కొండంత. కానీ, కృత్రిమ మేథతోనే జిందగీలను ముడిపెట్టి.. ఆ మాయలోనే మన ట్వంటీఫోర్ సెవెనూ తగలేసుకుంటున్న మనకు.. దాంతో కలిగే డ్యామేజెస్ గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ, జర లోతుకెళ్లి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ అనే కత్తి రెండో వైపున ఎంత పదునుందో తెలుస్తోంది. కృత్రిమ మేధ (AI) మనకు సౌకర్యాన్ని ఇస్తున్నట్లు కనిపించినా, దాని వెనుక భారీ రహస్య నష్టాలున్నాయి. ఇది మానవ మేధస్సును మొద్దుబార్చి, ఆలోచనా శక్తిని తగ్గిస్తోంది. అపారమైన శక్తిని, నీటిని వినియోగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. AIపై అతిగా ఆధారపడటం దీర్ఘకాలంలో మన భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతోంది. కనిపించే లాభాలకంటే, కనిపించని నష్టాలే ఎక్కువ. కలిగే కష్టనష్టాలు అపారమని తేలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

కృత్రిమ మేథ కాదు.. కృత్రిమ క్షోభ.. గ్లోబు నెత్తిన AI గుదిబండ.. దించేదెలా?
Ai Hidden Dangers
Balaraju Goud
|

Updated on: Aug 22, 2026 | 9:35 PM

Share

ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. అని బాలయ్య డైలాగ్‌ను గుర్తు చేస్తోంది మనలను అక్రమించేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. టెక్నో ప్రపంచాన్నే కాదు, సాదాసీదా జిందగీల్ని కూడా కబ్జా చేసి.. మనకు తెలీకుండానే మన నుంచి మనల్ని లాగేసుకుంటున్న కృత్రిమ మేథ.. ఇప్పుడిప్పుడే తన డార్క్ షేడ్స్‌ని పరిచయం చేస్తోంది. ఏఐ.. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయేలోగా మనలను, మన లైఫ్‌స్టైల్‌నే కాదు, మన పర్యావరణాన్నీ ఎంతెంత చిత్తు చేస్తోంది అని లెక్కలేసుకుని నోరెళ్లబెడుతున్నారు ఎక్స్‌పర్ట్స్. కృత్రిమ మేథ కారణంగా లాంగ్‌రన్‌లో ముంచుకొచ్చే ప్రమాదాలపై ఇప్పుడిప్పుడే ఒక అంచనా అయితే ఏర్పడింది. ఇదిగో ఒక్క క్షణం ఆగు.. చాట్‌జీపీటీని అడిగి చెబుతా..! అరె గ్రోక్.. ఇది తింటే ఒంట్లో ఎన్ని క్యాలరీలు పెరుగుతాయో చెప్పు..! బుర్రంతా గోక్కుంటావెందుకు.. చేతిలో జెమినీ ఏఐ ఉండగా..! ఇదీ యవ్వారం. ఆబాలగోపాలమూ ఇదే తంతు. కొత్త బంగారు లోకంలో తేలిపోతోంది ప్రపంచమంతా. అడగండి చెబుతా అంటూ అడిగిందే తడవుగా అరక్షణంలో ఆన్సరిచ్చే అద్భుతంగా చెలామణి అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆరు నుంచి అరవై దాకా అన్ని వయసులకూ ఫ్రీగానే దొరుకుతోంది ఇన్‌ఫర్మేటివ్ సర్వీస్. కేజీ స్టూడెంట్‌కి హోమ్‌వర్ అదే చేస్తుంది.. ప్రోగ్రామ్ డిజైనర్‌కి కోడింగూ అదే రాసిపెడుతోంది.. చివరకు కోర్టులిచ్చే జడ్జిమెంట్లను కూడా అదే చదివి చెబుతోంది. అవసరాన్ని బట్టి మానిప్యులేట్ చేస్తోంది కూడా. అన్ని ఏజ్‌ గ్రూపులను, అన్ని సెక్టార్స్‌నీ, అన్ని కార్నర్స్‌నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఫలితం ఏంటంటే.. పిల్లలు పేరెంట్స్ మీద, స్టూడెంట్స్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..