AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI).. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం మీదే చర్చ జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల మేధస్సును అనుకరించేలా కంప్యూటర్లు, యంత్రాలు ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి పనులు చేయగలిగే సాంకేతికత. మనిషి తన మేధస్సుతో చేసే కొన్ని తెలివైన పనులను యంత్రాలు, సాంకేతికతతో చేయించడమే AI లక్ష్యం. AI ప్రధానంగా భారీ మొత్తంలో డేటాను విశ్లేషించి, అందులోని నమూనాలను గుర్తిస్తుంది.

ఏఐ ద్వారా కలిగే లాభ నష్టాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఏఐ సాయపడుతుంది. భారీ డేటాలను కూడా విశ్లేషించి క్షణాల్లో మనం కోరుకునే సమాచారాన్ని ఇస్తుంది. కొత్త ఆవిష్కరణలకు ఇది దోహదపడే అవకాశముంది. తద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏఐ ప్రభావంతో ఇప్పటికే ఉన్న ఉద్యోగాల్లో భారీగా కోతపడే ప్రమాదముందని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. పలు రంగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏఐ మెళుకవలు అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఇంకా చదవండి

మనుషుల కంటే తెలివైనదిగా AI.. నియంత్రణ తప్పితే మానవాళికి ముప్పేనా..?

మనుషుల కంటే తెలివైన కృత్రిమ మేధ (AI) వ్యవస్థలను రూపొందించేందుకు టెక్ కంపెనీల మధ్య పోటీ నెలకొంటోంది. ఆ దిశగా ఆయా కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై కోట్లాది రూపాయలు ఖర్చు కోస్తున్నాయి. ఈ పరిణామాలపై Anthropic మాజీ ఉద్యోగి జో బెంటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. AI తన సామర్థ్యాలను తానే మెరుగుపరుచుకునే స్థాయికి చేరుకుంటే, అభివృద్ధి వేగం మానవ నియంత్రణకు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. AI రేస్‌లో భద్రత, పారదర్శకతకు టెక్ కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

AIతో మానవాళికి ముప్పు.. ఈ దశాబ్దంలోనే మనుషులంతా అంతమయ్యే ప్రమాదం!? సంచలన హెచ్చరిక

Artificial Intelligence News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై Anthropic పరిశోధకులు సంచలన హెచ్చరికలు చేశారు. అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు వచ్చే దశాబ్దంలోనే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో AI భద్రత, నియంత్రణ, అమెరికా-చైనా పోటీపై రాజకీయ చర్చ మళ్లీ వేడెక్కింది.

బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం! కొత్త ప్రయోగం

ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలంటే సాధారణంగా మేనేజర్లు, బాస్‌లు వారి పనితీరును రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఓ బిలియనీర్ కంపెనీలో మాత్రం ప్రమోషన్ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగుల పనితీరు, సహోద్యోగుల ఫీడ్‌బ్యాక్, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలను విశ్లేషించి ప్రమోషన్‌కు AI సిఫార్సు చేస్తోంది. ఈ విధానం వ్యక్తిగత పక్షపాతాలను తగ్గించి మరింత ఆబ్జెక్టివ్‌గా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

AI Jobs: ఏఐతో ఉద్యోగాలు పెరుగుతున్నా.. ఫ్రెషర్లకు మాత్రం కష్టకాలం! భారత్‌లో మారుతున్న జాబ్ మార్కెట్

Artificial Intelligence Jobs: భారత్‌లో AI కారణంగా కొత్త ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ఫ్రెషర్లకు మాత్రం ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. నోమురా నివేదిక ప్రకారం AI ప్రభావంతో భారత్‌లో మారుతున్న జాబ్ మార్కెట్, సీనియర్ ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్, ఎంట్రీ లెవల్ నియామకాల తగ్గుదల గురించి తెలుసుకోండి.

కృత్రిమ మేథ కాదు.. కృత్రిమ క్షోభ.. గ్లోబు నెత్తిన AI గుదిబండ.. దించేదెలా?

చారాణా కోడికి బారానా మసాలా అంటారే అదే అవుతోంది ఇక్కడ..! మనకు పావలా సౌకర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి రూపాయి నష్టాన్ని మిగులుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆ నష్టంలో కనిపించే నష్టం కొంతే అయినా, కనిపించని నష్టం కొండంత. కానీ, కృత్రిమ మేథతోనే జిందగీలను ముడిపెట్టి.. ఆ మాయలోనే మన ట్వంటీఫోర్ సెవెనూ తగలేసుకుంటున్న మనకు.. దాంతో కలిగే డ్యామేజెస్ గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ, జర లోతుకెళ్లి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ అనే కత్తి రెండో వైపున ఎంత పదునుందో తెలుస్తోంది. కృత్రిమ మేధ (AI) మనకు సౌకర్యాన్ని ఇస్తున్నట్లు కనిపించినా, దాని వెనుక భారీ రహస్య నష్టాలున్నాయి. ఇది మానవ మేధస్సును మొద్దుబార్చి, ఆలోచనా శక్తిని తగ్గిస్తోంది. అపారమైన శక్తిని, నీటిని వినియోగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. AIపై అతిగా ఆధారపడటం దీర్ఘకాలంలో మన భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతోంది. కనిపించే లాభాలకంటే, కనిపించని నష్టాలే ఎక్కువ. కలిగే కష్టనష్టాలు అపారమని తేలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

Google AI Plus: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాది పాటు AI ప్లాన్స్ ఫ్రీ! Geminiలో అదిరిపోయే స్టడీ ఫీచర్లు

Google AI Plus Free For Students: కాలేజీ విద్యార్థులకు గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ సహా 140కి పైగా దేశాల్లో అర్హత కలిగిన విద్యార్థులకు Google AI Plusను ఏడాది పాటు ఉచితంగా అందించనుంది. అమెరికా విద్యార్థులకు Google AI Proను ఉచితంగా అందిస్తోంది.

AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే

AI Jobs in India: AI కారణంగా ఉద్యోగాలు భారీగా తగ్గుతాయన్న ఆందోళనల మధ్య నోమురా నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. భారత్‌లో AIకి సంబంధించిన నియామకాలు ఉద్యోగ నష్టాల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. భారత్ తోపాటు పలు ఆసియా దేశాలలోనూ ఇదే విధంగా ఉండటం గమనార్హం.

Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!

AI impact on Jobs: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను ఒక బిగ్‌ రెవెల్యూషన్‌గా చూస్తోంది. ఇది వచ్చాక చాలా పనులన్నీ చాలా సులభమైపోయానని ఓ వర్గం ఆలోచిస్తుంటే.. మరో వర్గం మాత్రం.. ఈ ఏఐ రాక తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంటోంది. అయితే ఫ్యూచర్‌లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఏ రంగంపై ఉంటుందనే దానిపై ప్రముఖ వ్యాపారవేత్త న్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి షాకింగ్ విషయాలు చెప్పారు అవేంటో తెలుసుకుందాం పదండి.

  • Anand T
  • Updated on: Aug 8, 2026
  • 4:43 pm

చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్‌లో సిలబస్ ఉంటుంది.. కానీ జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు ఉంటాయి” అంటూ యువతను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి నిర్దిష్టమైన ప్రశ్నపత్రం, ముందుగా నిర్ణయించిన మార్గం ఉండదని.. కొన్నిసార్లు అసలు ప్రశ్న ఏమిటో కూడా ఎవరూ చెప్పరని, దాన్ని తామే గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.

మారుతున్న Gen Z ఆలోచన.. ఇళ్లు కొనడం మానేస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఏమవుతుంది?

ఒకప్పుడు ఉద్యోగం వచ్చిందంటే ఇల్లు కొనాలి.. పెళ్లి అయితే సొంతింటి కోసం లోన్ తీసుకోవాలి.. ఇదే మధ్యతరగతి భారతీయుల ఆలోచన. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను జెన్ జెడ్ మార్చేస్తోంది. ‘ఇల్లు కొనడం కంటే.. ముందుగా సంపద పెంచుకోవాలి’ అంటున్న ఈ తరం నిజంగానే సొంతింటికి దూరమైతే ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు.. సిమెంట్‌ నుంచి స్టీల్‌ వరకు.. ప్రభుత్వ స్టాంప్ డ్యూటీ నుంచి ఉపాధి వరకు.. దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుంది? ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థిరాస్తి రంగం ఎలా మారుతుంది? అసలు Gen Z ఇళ్లు కొనడం మానేస్తుందా.. లేక కేవలం కొంచెం ఆలస్యంగా కొనుగోలు చేస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న ఆసక్తికరమైన చర్చగా మారుతున్నాయి.

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం!

Mana Jampala AI Voxa Startup: కేవలం 12 ఏళ్ల వయసులోనే 'వోక్సా' అనే AI స్టార్టప్‌ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు సేవలు అందిస్తున్న మానా జంపాల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 9 ఏళ్లకే పైథాన్ నేర్చుకుని, ChatGPT, Claude వంటి టూల్స్ సహాయంతో AI ఉత్పత్తులను అభివృద్ధి చేసిన ఆమె విజయగాథ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.

  • Rakesh
  • Updated on: Aug 7, 2026
  • 6:30 pm

ఏఐ యుగంలో తిరుగులేని ఉద్యోగాలు ఇవే..! Gen Z లు మస్ట్‌గా తెలుసుకోండి..

కృతిమ మేధస్సు (AI) మీ ఉద్యోగాన్ని మింగేస్తుందా? రాబోయే రోజుల్లో మీ కెరీర్ భద్రంగానే ఉంటుందా? టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సృష్టిస్తున్న వేళ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే నిపుణులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏఐ ఏమీ చేయలేని రిస్క్ లేని ఉద్యోగాలు ఏంటి? భవిష్యత్తులో మనం రేసులో నిలబడాలంటే ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలో తెలుసుకుందాం..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా