AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 2 రాశిఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

Horoscope Today (October 02, 2026): శుక్రవారం నాటి రాశిఫలాలు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నాయి. మేష రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన వార్తలు వినిపించవచ్చు. మిథున రాశి వారికి ప్రోత్సాహం, ఆదరణతో పాటు గౌరవమర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శుక్రవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 2 రాశిఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
Rashi Phalalu 02 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 2, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం లేదా పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. బంధువులకు చేదోడు వాదోడుగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక లావాదేవీలేవీ పెట్టుకోవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. ఉచిత సహాయాలు, దానధర్మాలు, అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వా నాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వా మికి పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరగడానికి బాగా అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా సాగుతాయి. బంధు వుల శుభకార్యానికి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రముఖులతో స్నేహాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా వృద్ధి చెందు తుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇత రులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా ఊహించని ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్దడంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓర్పు, సహనాలతో ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు గడిస్తారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సాధారణ సమస్యలను, బంధువుల విమర్శలను పట్టించుకోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అత్యవసర పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీ లకు, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సహచరులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. ఏక కాలంలో అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నించడం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..