AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఇతరులను గుడ్డిగా నమ్మకండి.. ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారు జాగ్రత్త..!

అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆదాయం కంటే ఖర్చులు పెరగడం, అనుకోని నష్టాలు, పెట్టుబడుల్లో ఇబ్బందులు లేదా మోసపోయే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

Money Astrology: ఇతరులను గుడ్డిగా నమ్మకండి.. ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారు జాగ్రత్త..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2026 | 4:07 PM

Share

అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు కొన్ని రాశుల వారికి ఆదాయ స్థానం కంటే వ్యయ స్థానం బాగా బలంగా ఉంది. డబ్బు నష్టం, డబ్బును పోగొట్టుకోవడం, మోసపోవడం, పెట్టుబడులు దెబ్బ తినడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులవారు ఖర్చుల విషయంలో ఎంత అప్రమత్నంగా ఉంటే అంత మంచిది. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం, ఆర్థిక లావాదేవీలు, ఇతరులను గుడ్డిగా నమ్మడం, ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించడం, షేర్లలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మేషం

ఈ రాశికి వ్యయ స్థానంలో శనీశ్వరుడి వక్ర సంచారం వల్ల నెలన్నర పాటు ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. షేర్ల విష యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. మిత్రుల వల్ల వృథా ఖర్చులు పెరగడమే కాక, డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. గతంలో మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది.

సింహం

ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. చేతిలో కష్టార్జితం నిలవకపోవచ్చు. ఆర్థికంగా మోసపోవడం, నష్టపోవడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బు తీసు కున్నవారు తిరిగి ఇవ్వడం జరగదు. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల ఆర్థికంగా నష్టపో తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా ఉత్తమం.

ఇవి కూడా చదవండి

తుల రాశి

ఈ రాశిలో వ్యయ స్థానాధిపతి బుధుడి సంచారంతో పాటు ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎక్కడా ఎటువంటి పెట్టుబడులూ పెట్టవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం ఉత్తమం.

వృశ్చికం

ఈ రాశికి వ్యయ స్థానంలో ఆదాయ, వ్యయాధిపతులైన బుధ, శుక్రులు కలవడం వల్ల ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సి వస్తుంది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృథా వ్యయాలు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ధనుస్సు

రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పటికీ, దుస్థానగతుడైనందు వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కలుగుతాయి. బంధుమిత్రుల్ని సైతం నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.

మీనం

ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల నష్టపోవడం లేదా మోసపోవడం ఎక్కువగా జరుగుతుంది. ఆశలు, ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం ఉంది. ఆదాయం కంటే ఖర్చు బాగా పెరుగుతుంది. నష్టదాయక వ్యవహారాలతో చిక్కుల్లో పడతారు. అనవసర పరిచయాలు ఇబ్బంది పెడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా నష్టాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము గానీ, బాకీలు, బకాయిలు గానీ చేతికి అందకపోవచ్చు. ప్రయాణాల వల్ల నష్టపోతారు.

Follow Us