AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి శుక్రాదిత్య యోగం..నవంబర్ వరకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!

Shukraditya Yoga 2026: శుక్రాదిత్య యోగం 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కలయికలు కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తాయి. ప్రస్తుతం తులా రాశిలో సూర్యుడు, శుక్రుడు కలవడంతో శుక్రాదిత్య యోగం ఏర్పడింది. ఈ గ్రహ యుతి వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మెరుగైన అవకాశాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, తుల, ధనుస్సు రాశుల వారికి ఈ యోగం అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

వీరికి శుక్రాదిత్య యోగం..నవంబర్ వరకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
Shukraditya Yoga 2026
Janardhan Veluru
|

Updated on: Oct 21, 2026 | 6:46 PM

Share

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం, నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడు సంపద, సుఖసంతోషాలు, విలాసాలు, ప్రేమ, కళలకు కారకుడిగా చెబుతారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు శుక్రాదిత్య యోగం (Shukraditya Yoga) ఏర్పడుతుంది. 2026 అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో, అప్పటికే అక్కడ ఉన్న శుక్రుడితో కలయిక ఏర్పడింది. దీంతో ఇప్పుడు శుక్రాదిత్య యోగం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ వరకు కొన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

మేష రాశి

శుక్రాదిత్య యోగం మేష రాశి వారికి అనుకూల ఫలితాలు దక్కుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపించే అవకాశముంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు అందుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో సానుకూలత పెరిగి, భాగస్వామితో అనుబంధం బలపడే అవకాశం ఉంది.

తులా రాశి

తులా రాశికి అధిపతి శుక్రుడు కావడంతో, ఈ రాశిలో ఏర్పడిన శుక్రాదిత్య యోగం ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో ఆదాయాన్ని మెరుగుపరచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించే అవకాశముంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగడంతో మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాల్లో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారుతాయి. గతంలో పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మార్గం దొరికే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు పెరిగి, విలాసవంతమైన వస్తువులు లేదా ఇంటికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ గ్రహ యుతి పురోగతికి అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నవారు అనుకూల పరిస్థితులను పరిశీలిస్తే మంచిది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో గతంతో పోలిస్తే మెరుగుదల కనిపిస్తుంది. కొత్త ప్రణాళికలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆశించిన ఫలితాలకు దగ్గరవుతారు.

(గమనిక: ఈ కథనం జ్యోతిష్యశాస్త్ర విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైనవి కావు)

Follow Us