శ్రీశైలం రిజర్వాయర్లో కృష్ణా జలాలు తగ్గుముఖం పట్టడంతో సప్తనదుల సంగమేశ్వర ఆలయం ఆరు నెలల ముందే బయటపడింది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గడంతో, సాధారణంగా ఉగాది నాటికి కనిపించే ఆలయం ఈ ఏడాది దసరాకు ముందే దర్శనమిచ్చింది. 23 ఏళ్లలో కేవలం రెండు నెలలు మాత్రమే జలదిగ్బంధంలో ఉండటం ఇదే ప్రథమం.