AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి.. దోషిగా కెన్యా రాక్షస మతగురువు!

కెన్యాలోని షకహోలా అడవిలో బయటపడిన సామూహిక సమాధులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యేసును కలవాలంటే ఉపవాసం ఉండాలని బలవంతపెట్టి హింసించి 190 మంది చిన్నారుల మరణానికి కారణమైన స్వయం ప్రకటిత పాస్టర్ పాల్ మెకెన్సీతో పాటు 28 మందిని మొంబాసా హైకోర్టు తాజాగా దోషులుగా తేల్చింది. నవంబర్ 6న వీరికి శిక్ష ఖరారు చేయనుంది.

దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి.. దోషిగా కెన్యా రాక్షస మతగురువు!
Kenya Cult Leader Convinced Followers To Starve Found Guilty Of 191 Murders
Sharada V
|

Updated on: Oct 21, 2026 | 9:52 PM

Share

కెన్యాలోని షకహోలా అడవిలో బయటపడిన సామూహిక సమాధులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యేసును కలవాలంటే ఉపవాసం ఉండాలని బలవంతపెట్టి హింసించి 190 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యాడు స్వయం ప్రకటిత పాస్టర్ పాల్ మెకెన్సీ. అతనితో పాటు 28 మందిని మొంబాసా హైకోర్టు తాజాగా దోషులుగా తేల్చింది. నవంబర్ 6న వీరికి శిక్ష ఖరారు చేయనుంది.

2023లో వెలుగులోకి షకహోలా  మారణకాండ

కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో 2023లో  పెద్ద సంఖ్యలో సమాధులు బయటపడటంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తవ్వకాలు జరిపిన కొద్దీ చిన్నారులు, మహిళలు, పురుషుల మృతదేహాలు భారీ సంఖ్యలో బయటపడ్డాయి. కటిక ఉపవాసాలతో దేవుడిని చేరుకోవచ్చని నమ్మించి చిన్నారులు, అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న కెన్యా మతగురువు ఉదంతం బయటపడటం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన మతబోధకుడే.. వారిని నమ్మించి మృత్యువుకు దగ్గర చేసాడు. ‘ఉపవాసం ఉంటే యేసు ప్రభువును కలుసుకోవచ్చు’ అంటూ అనుచరులను నమ్మించి, వారి మరణాలకు కారణమయ్యాడు పాస్టర్ పాల్ మెకెన్సీ. మత విశ్వాసాల ముసుగులో జరిగిన ఈ దారుణ ఘటన మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ముందుగా చిన్నారులే చనిపోవాలంటూ బోధనలు

2023 ఏప్రిల్‌లో అడవిలో సామూహిక సమాధుల నుంచి పోలీసులు 429 మృతదేహాలను వెలికితీశారు. చిన్న పిల్లల నుంచి పెద్దల మృతదేహాలను ఖననం చేయలేక అక్కడే వదిలిపెట్టారు.  ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్’ పేరుతో పాస్టర్‌ పాల్ మెకెన్సీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బయటి ప్రపంచంలో పాపం పెరిగిపోయిందని, అడవిలో ఉంటే మోక్షం లభిస్తుందని అమాయకులను నమ్మించాడు. చాలా మందిని అడవిలోని తన 800 ఎకరాల ఫార్మ్‌హౌస్‌ కు తీసుకెళ్లాడు. అక్కడికి వారిపై కఠిన ఆంక్షలు అమలు చేసాడు.  అనుచరుల మరణాలకు సంబంధించి క్రమబద్ధమైన విధానం అమలు చేసాడు. ముందుగా చిన్నారులు ఆ తర్వాత టీనేజర్లు, మహిళలు, చివరగా పురుషులు మరణించేలా ఒక క్రమాన్ని నిర్దేశించాడు. వారిని ఉపవాసం ఉండాలని బలవంత పెట్టడం,  ఆహారం ఇవ్వకుండా చిన్నారులను ఆకలితో అలమటించేలా చేశాడు. తినడానికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించేవాడు. దేవుడి పేరుతో సాగిన ఈ దారుణ ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

పోస్టుమార్టం నివేదికల్లో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొందరు ఆకలితో చనిపోగా, మరికొందరు ఊపిరాడకుండా, మెడపై బలంగా ఒత్తడం, తలపై తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. దేవుడిని చేరుకోవచ్చనే నమ్మకంతో అమాయకులను మరణం వైపు నడిపించిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.

కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరుమున్నీరైన బాధితులు

ఈ కేసులో తీర్పు వెలువడిన సమయంలో బాధిత కుటుంబాలకు చెందిన కొందరు కోర్టుకు హాజరయ్యారు. ఫ్రాన్సిస్ వాంజే అనే 62 ఏళ్ల వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కోల్పోయాడు. మృతుల్లో కుమార్తెతో పాటు ఇద్దరు మనవళ్లు కూడా ఉన్నారు. కోర్టు తీర్పుపై సంతోషంగా ఉన్నా తన కుటుంబాన్ని కోల్పోయిన బాధ ఎప్పటికీ తీరదని బాధపడ్డాడు. పాస్టర్‌ నుంచి దూరంగా ఉంటున్న కుమారుడు డాన్ బాధితులకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేసాడు. కేసులో శిక్షను నవంబర్ 6న ఖరారు చేసే అవకాశం ఉంది. మత విశ్వాసాలను ఆసరాగా చేసుకుని అమాయకులను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో షకహోలా ఘటన ప్రపంచానికి మరోసారి గుర్తుచేసింది.

Follow Us
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!
వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?