AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. ఈసీ సడెన్ డెసిషన్..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేసింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. తొలుత కొన్ని స్థానాల్లో నిలిపివేయాలని భావించగా.. ఇప్పుడు అన్ని స్థానాల్లో బ్రేక్ పడింది.

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. ఈసీ సడెన్ డెసిషన్..
Ap Local Body Elections
Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 11:37 PM

Share

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను హోల్డ్ చేసింది. దీంతో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వినతులు, ఆధారాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది. అధికారుల నివేదిక తర్వాత రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. నామినేషన్ల గడువు పొడిగిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోనుంది. నామినేషన్లు వేయలేకపోయినా అభ్యర్థుల అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చాక నామినేషన్ల గడువు పొడిగించడంపైవ గురువారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అయితే తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు  ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌చంద్ర పునేఠా అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కూటమి నేతలు స్పందించారు. కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నిలను తొలి రోజు నుంచే అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగితేనే 16వ ఆర్ధిక సంఘం, కేంద్ర ప్రభుత్వ నిధులు పొందే అవకాశముంటుందని చెబుతున్నారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నామినేన్లు దాఖలు చేసేందుకు గడువు పొడిగించాలని పిటిషన్‌లో పేర్కొంది. అలాగే తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, వారు సమర్పించిన ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలుత ఎస్‌ఈసీ 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేసింది. మిగతాచోట్ల ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని తొలుత భావించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది.

Follow Us