AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ.. అమెరికా సంస్థలతో భాగస్వామ్యంపై చర్చలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ కీలక భేటీ జరిగింది. జామ్‌నగర్‌లో ఈ సమావేశం జరగ్గా.. పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా, భారత్ సంస్థల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు.

అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ.. అమెరికా సంస్థలతో భాగస్వామ్యంపై చర్చలు..
Mukesh Ambani
Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 10:49 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీతో జామ్‌నగర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముకేష్ అంబానీ, అనంత్ అంబానీ ఘన స్వాగతం పలికారు. అనంతరం జామ్ నగర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని మార్కో రూబియో, సెర్గియో గోర్‌ సందర్శించారు. రిఫైనరీ విస్తీర్ణం, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇతర కార్యకలాపాల గురించి ముకేష్ అంబానీని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. దీని నిర్మాణాన్ని చూసి అమెరికా ప్రతినిధులు ముకేష్ అంబానీని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని నిర్మించడం గర్వించదగ్గ విషయమని కితాబిచ్చారు.

ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులకు రిలయన్స్‌కు చెందిన న్యూ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీలు, నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల కూడా ముకేష్ అంబానీ వివరించారు. ఈ గిగా ఫ్యాక్టరీలను దశలవారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న పెట్టుబడుల గురించి కూడా ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ అతిధులకు వివరించారు. ఇప్పటికే ఉన్న అధునాతన తయారీ సామర్థ్యాలు, డీప్‌టెక్ పరిజ్ఞానం గురించి మార్కో రూబియో, సెర్గియో గోర్‌కు తెలిపారు. జామ్‌నగర్ సముదాయాన్ని డీప్‌టెక్, ఆవిష్కరణలు, అధునాతన తయారీకి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యం గురించి వారికి స్పష్టం చేశారు. ఈ సందర్శనలో భాగంగా అమెరికా ప్రతినిధులతో అంతర్జాతీయ ఇంధన రంగ పరిణామాలు, సంప్రదాయ ఇంధనం, నూతన ఇంధన రంగాల్లో వాణిజ్య భాగస్వామ్య అవకాశాలపై ముకేష్ అంబానీ చర్చలు జరిపారు. అందుబాటు ధరల్లో ఇంధన సరఫరా చేయడంతో పాటు సాంకేతికంగా పురోగతి సాధించడం, ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అలాగే ఈ కీలక భేటీలో ఇంధన, డిజిటల్ మౌలిక సదుపాయాల మధ్య పెరుగుతున్న అనుసంధానంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

పెరుగుతున్న డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరాను తీర్చడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై డేటా సెంటర్ల పాత్ర వంటి అంశాలను అమెరికా ప్రతినిధులతో జరిపిన భేటీలో ముకేష్ అంబానీ, అనంత్ అంబానీ ప్రస్తావించారు. సాంకేతికత, ఇంజినీరింగ్, అధునాతన తయారీ రంగాల్లో భారత్, అమెరికా సంస్థలకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవడంపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం తమ సంస్థను సంప్రదించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లకు రిలయన్స్ కృతజ్ఞతలు తెలిపింది. తమ అభిప్రాయాలను పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేసింది.

Follow Us
అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ..
అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ