జెన్ జీ
జెన్ జీ (Generation Z) అనేది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరంను సూచిస్తుంది. ఈ తరం చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీతో పెరిగింది. అందుకే డిజిటల్ యుగంలో పెరిగిన జెన్ జీని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తారు. వీరి ఆసక్తులు, అలవాట్లు, సమాచారాన్ని స్వీకరించే విధానం గత తరాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం రంగాల్లో వీరు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు.
జెన్ జీ టెక్నాలజీని వేగంగా నేర్చుకోవడంతో పాటు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తిచూపుతారు. తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేందుకు వీరు వెనుకాడరు. ఏఐ టూల్స్, ఆన్‌లైన్ గేమింగ్స్, ఇతర డిజిటల్ నైపుణ్యాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఉద్యోగం ఒక్కటే జీవితం అన్నట్లు కాకుండా వర్క్- లైఫ్ బ్యాలెన్స్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేవీరు.. ఆర్థిక అంశాలు, ఆరోగ్యం, ఫిట్‌నెస్, ట్రావెల్, వినోదం, ఓటీటీపై ఎక్కువ ఆసక్తిచూపుతారు.
ఉద్యోగ ప్రపంచంలో తీవ్ర పోటీ, అతిగా సోషల్ మీడియా వినియోగం తదితర కారణాలతో జెన్ జీలో కొందరు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముంది.
ఇంకా చదవండిదేశ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం.. ఖేలో ఇండియా డైలాగ్‌లో దిశానిర్దేశం..!
జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా దేశ యువతతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .గురువారం (ఆగస్టు 27) ఖేలో ఇండియా డైలాగ్ - ఖేల్ కీ బాత్ ప్రధాని మోదీ కే సాథ్ కార్యక్రమంలో యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యా సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో యువ సంవాద్ నిర్వహిస్తారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 26, 2026
- 11:54 am
Soft Blocking: Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే ఏమిటి?
Gen Z Trends Soft Blocking: సోషల్ మీడియాలో ఎవరినైనా పూర్తిగా బ్లాక్ చేయకుండా దూరం పెట్టాలనుకుంటున్నారా? Gen Zలో ప్రాచుర్యం పొందుతున్న “Soft Blocking” అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఎందుకు యువత దీనిని ఎంచుకుంటుందో వివరంగా తెలుసుకోండి.
- Rajashekher G
- Updated on: Aug 25, 2026
- 3:58 pm
కృత్రిమ మేథ కాదు.. కృత్రిమ క్షోభ.. గ్లోబు నెత్తిన AI గుదిబండ.. దించేదెలా?
చారాణా కోడికి బారానా మసాలా అంటారే అదే అవుతోంది ఇక్కడ..! మనకు పావలా సౌకర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి రూపాయి నష్టాన్ని మిగులుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆ నష్టంలో కనిపించే నష్టం కొంతే అయినా, కనిపించని నష్టం కొండంత. కానీ, కృత్రిమ మేథతోనే జిందగీలను ముడిపెట్టి.. ఆ మాయలోనే మన ట్వంటీఫోర్ సెవెనూ తగలేసుకుంటున్న మనకు.. దాంతో కలిగే డ్యామేజెస్ గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ, జర లోతుకెళ్లి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే కత్తి రెండో వైపున ఎంత పదునుందో తెలుస్తోంది. కృత్రిమ మేధ (AI) మనకు సౌకర్యాన్ని ఇస్తున్నట్లు కనిపించినా, దాని వెనుక భారీ రహస్య నష్టాలున్నాయి. ఇది మానవ మేధస్సును మొద్దుబార్చి, ఆలోచనా శక్తిని తగ్గిస్తోంది. అపారమైన శక్తిని, నీటిని వినియోగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. AIపై అతిగా ఆధారపడటం దీర్ఘకాలంలో మన భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతోంది. కనిపించే లాభాలకంటే, కనిపించని నష్టాలే ఎక్కువ. కలిగే కష్టనష్టాలు అపారమని తేలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
- Balaraju Goud
- Updated on: Aug 22, 2026
- 9:35 pm
విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!
దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాట జెన్ జెడ్ ఓటర్ల ప్రాధాన్యత పెరిగింది. ఆయన పార్టీ యువతకు పెద్దపీట వేయడంతో, ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సైతం యువతను ఆకర్షించే వ్యూహాలను అవలంబిస్తున్నాయి. డీఎంకే సంస్థాగత మార్పులు చేపట్టి, జిల్లా స్థాయి పదవుల్లో వయోపరిమితులు విధించి, యువతకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి.
- Ch Murali
- Updated on: Aug 22, 2026
- 6:13 pm
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!
Gen Z డేటింగ్ కల్చర్‌లో కొత్త కొత్త పదాలు, ట్రెండ్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కమిట్‌మెంట్ లేని సిట్యువేషన్‌షిప్ నుంచి అకస్మాత్తుగా సంబంధాన్ని తెంచుకునే ఘోస్టింగ్ వరకు ఎన్నో రకాల డేటింగ్ స్టైల్స్ ఉన్నాయి. బెంచింగ్, బ్రెడ్‌క్రంబింగ్, ఆర్బిటింగ్, జాంబీయింగ్, పాకెటింగ్, సాఫ్ట్ లాంచ్, హార్డ్ లాంచ్ వంటి పదాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. అయితే ట్రెండ్స్ మారినా గౌరవం, నమ్మకం, స్పష్టమైన కమ్యూనికేషన్, బౌండరీస్ వంటి ఆరోగ్యకరమైన సంబంధాల విలువలు మాత్రం మారవు.
- Phani CH
- Updated on: Aug 14, 2026
- 4:00 pm
Gen Z యువత డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఆ విషయంలో 5 శాతమే.. కొత్త అధ్యయనం!
భారత Gen Z యువత నెలవారీ ఖర్చుల్లో ప్రయాణాలకు కేవలం 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు SalarySe అధ్యయనం వెల్లడించింది. బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు 20.1 శాతం, కిరాణా 15.7 శాతం, ఆర్థిక సేవలు 12.2 శాతం, షాపింగ్ 11.9 శాతం, ఆహారం 11.5 శాతంగా ఉన్నాయి. అంటే వారి ఖర్చులో ఎక్కువ భాగం రోజువారీ అవసరాలకే వెళ్తోంది.
- SN Pasha
- Updated on: Aug 14, 2026
- 11:30 am
జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!
ప్రస్తుతం జెన్‌జీ హవా నడుస్తుంది. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది. ప్రస్తుతం ఉన్న జెన్‌జీల అభిరుచులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలా అని పిల్ల తనంగా కాదు.. చాలా పెద్దరికంగా, దూరదృష్టితో ఉంటారు. వారి ఆలోచనలు , వారి విజన్ చాల డిఫరెంట్ గా ఉంటుంది.
- Rajeev Rayala
- Updated on: Aug 12, 2026
- 4:50 pm
రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్ వద్దు.. ఆత్మకథలు చదవండి.. జెన్‌జీకి ప్రధాని మోదీ కీలక సందేశం
దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (ఆగస్టు 12, 2026) కీలక సందేశం ఇచ్చారు. ఇది “రీల్స్ యుగం” అని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు యువతను అనేక దిశల్లోకి తీసుకెళ్లగలరని పేర్కొంటూ, జీవితంలో షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవద్దని సూచించారు. విజయాన్ని త్వరగా అందుకోవాలనే ఆలోచన కంటే కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలన్నారు. యువత ఆత్మకథలను చదవాలని పిలుపునిచ్చారు.
- Balaraju Goud
- Updated on: Aug 12, 2026
- 2:43 pm
జెండా లేని జెన్‌జీ.. యువత వెనకే పార్టీలు..! లీకుతో మొదలైంది, మేకై దిగుతోందా?
దేశ రాజకీయాల్లో జెన్‌జీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందా? పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, రిజర్వేషన్లు, ప్రభుత్వ విధానాలపై యువత రోడ్డెక్కుతున్న తీరు కొత్త రాజకీయ మార్పులకు సంకేతమా? ఇప్పటివరకు సంప్రదాయ పార్టీలకు యువత ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపించగా.. ఇప్పుడు అదే యువత రాజకీయ పార్టీల అజెండాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటోందా? సోషల్ మీడియా నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌ల వరకు జెన్‌జీ చురుకుదనం పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? జెన్‌జీ నిజంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 11, 2026
- 9:40 pm
యూపీలో సరికొత్త రాజకీయ వ్యూహాలు.. ఆ ఓటర్ల వైపే అన్ని పార్టీల చూపు..!
Gen Z Voters: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులతో పాటు ఇప్పుడు జెన్-జీ ఓటర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. సోషల్ మీడియా, విద్య, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిజిటల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని యువ ఓటర్ల మద్దతు వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, వారిని ప్రసన్నం చేసుకోవడం పార్టీలకు కీలకంగా మారింది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 11, 2026
- 4:08 pm
Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!
వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు రావడం సహజం. అలాగే చర్మం విషయంలోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. 20ల్లో చర్మం త్వరగా కోలుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. 30, 40ల్లో కొల్లాజెన్ ఉత్పత్తి, తేమను నిలుపుకునే సామర్థ్యం, చర్మ కణాల పునరుత్పత్తి క్రమంగా తగ్గుతాయి. దీంతో ముడతలు, పొడిబారడం, పిగ్మెంటేషన్, చర్మం వదులుగా మారడం వంటి సమస్యలు కనిపించొచ్చు.
- Bhavani
- Updated on: Aug 10, 2026
- 8:40 pm
జెన్‌జీల థింకింగ్ మారింది.. కానీ అదొక్కటే మారలేదు.. డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో తెలుసా..?
జెన్‌జీ తరంలో ప్రోటీన్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రొటీన్ పౌడర్లు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులతో పాటు పప్పులు, సోయా, గింజలు, మాంసాహారం వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ను యువత తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయా? ప్రోటీన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయా? మాంసాహారంలోనే ప్రోటీన్ ఉంటుందా? వంటి ఎన్నో అపోహలు ఉన్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 10, 2026
- 6:44 pm