AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

ప్రస్తుతం జెన్‌జీ హవా నడుస్తుంది. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది. ప్రస్తుతం ఉన్న జెన్‌జీల అభిరుచులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలా అని పిల్ల తనంగా కాదు.. చాలా పెద్దరికంగా, దూరదృష్టితో ఉంటారు. వారి ఆలోచనలు , వారి విజన్ చాల డిఫరెంట్ గా ఉంటుంది.

జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!
Movie News
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2026 | 4:50 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది అదే జెన్ జీ.. ప్రతిదాంట్లో జెన్ జీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సినిమాల విషయంలో కూడా.. చాలా మంది దర్శకనిర్మాతలు ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. జెన్ జీ ఆడియన్స్ ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటి సినిమాలనే తెరకెక్కించడానికి ఆసక్తిచూపిస్తున్నారు దర్శకులు. ఈ జనరేషన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో లవ్ స్టోరీస్ ముందు వరసలో ఉంటాయి. రొమాంటిక్, లవ్, కామెడీ, ఎమోషన్ మిక్స్ అయినా  సినిమాలను జెన్ జీ ఆడియన్స్ ఎక్కువగాచూస్తున్నారు . ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్ లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా జెన్ జీలకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

బాధ్యత లేని హీరో ప్రేమలో పడటం, ప్రేమలోని కన్ఫ్యూజన్, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, బ్రేకప్‌లు, హీరయిన్ హీరోను కాదని మరొకరిని ప్రేమించడం ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జెన్ జీలు అలాంటి సినిమానే ఇది కూడా.. ఆ మూవీ మరేదో కాదు.. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు.

ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున

గత ఏడాది థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హీరో హీరోయిన్ మధ్య క్యూట్ లవ్ స్టోరీకి కామెడీని యాడ్ చేసి చూపించాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మౌళి సినిమాలో తన నటనతో కామెడీతో ఆకట్టుకున్నాడు. శివానీ కూడా మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో లిటిల్ హార్ట్స్ అందుబాటులో ఉంది. ఈ సినిమా చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us