Global Security: ఉగ్రవాదుల చేతిలో AI అస్త్రం.. ప్రపంచానికి పెను ముప్పని భారత్ హెచ్చరిక
మనిషి కనిపెట్టిన ఆయుధాలు మనిషినే భయపెడుతున్నాయి. ఇప్పుడు మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సు కూడా ప్రమాదంగా మారుతోంది. ఇప్పటివరకు తుపాకులు, బాంబులతో దాడులు చేసిన ఉగ్రవాదులు. రేపు AIని ఆయుధంగా మార్చుకుంటే పరిస్థితి ఏంటి? శత్రువుల కదలికలను గుర్తించడం నుంచి దాడులకు వ్యూహాలు రచించడం వరకు యంత్రాలే చేస్తే ఎలా ఉంటుంది? మనిషి నియంత్రణ లేని ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కితే ప్రపంచ భద్రతకు ముప్పు తప్పదు. ఇవి చిన్నపాటి ఆందోళనలు కావు. ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన భద్రతా సవాళ్లు. ఈ ప్రమాదంపైనే భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా హెచ్చరించింది.

కృత్రిమ మేధస్సు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తోంది. వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు. ఇలా ప్రతి రంగంలోనూ ఉపయోగపడుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషిస్తోంది. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. కానీ ప్రతి నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే. AIకి మరో ప్రమాదకరమైన కోణం కూడా ఉంది. మంచి పనులకు ఉపయోగపడాల్సిన టెక్నాలజీని చెడు పనులకు వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి AI చిక్కితే భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అదుపు తప్పితే విధ్వంసమే యుద్ధరంగంలో AI వినియోగం పెరుగుతోంది. డ్రోన్లతో నిఘా పెట్టడం, శత్రువుల కదలికలను గుర్తించడం, యుద్ధ పరిస్థితులను విశ్లేషించడం వంటి పనులకు దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే స్వయంచాలక ఆయుధాలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మనిషి నేరుగా ఆదేశాలు ఇవ్వకుండానే లక్ష్యాలను గుర్తించి దాడి చేసే వ్యవస్థలు ప్రమాదకరంగా మారొచ్చు. ఇలాంటి ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కితే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది. అమాయక ప్రజలు లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది. దాడిని ఆపాల్సిన సమయంలో వ్యవస్థ స్పందించకపోవచ్చు. ఫలితంగా భారీ ప్రాణనష్టం జరగొచ్చు. అందుకే ఆయుధాల వినియోగంలో మనిషి పర్యవేక్షణ తప్పనిసరి కావాలి. సైబర్ యుద్ధం సైబర్ యుద్ధం కూడా కొత్త రూపం దాల్చుతోంది. గతంలో కంప్యూటర్ వ్యవస్థలపై దాడి చేయాలంటే ప్రత్యేక నైపుణ్యం, ఎక్కువ సమయం అవసరమయ్యేది. ఇప్పుడు AIతో ఈ ప్రక్రియ వేగవంతమయ్యే ప్రమాదం ఉంది. దాడులకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, వ్యవస్థల్లోని...
