డా. కొండవీటి శివ నాగరాజు
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు | డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్ – TV9 తెలుగు | పరిశోధకుడు | సామాజిక సేవకుడు | రచయిత
వ్యక్తిగత వివరాలు
పేరు: డా. కొండవీటి శివ నాగరాజు
విద్యార్హతలు
బి.ఏ – టి.జె.పి.ఎస్. కళాశాల, గుంటూరు
ఎం.ఏ (ఆర్కియాలజీ) – ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఫస్ట్ ర్యాంక్)
NSS ఓరియంటేషన్ కోర్సు – కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం – ఈనాడు జర్నలిజం స్కూల్, హైదరాబాద్
అధ్యాపక వృత్తి
జర్నలిజంలోకి రాకముందు విద్యారంగంలో సేవలందించారు.
లెక్చరర్ – KMS జూనియర్ కళాశాల, క్రోసూరు
NSS ప్రోగ్రాం ఆఫీసర్
ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్
లెక్చరర్ – TRR జూనియర్ కళాశాల, పిడుగురాళ్ల
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించడంలో విశేష కృషి చేశారు.
సామాజిక చైతన్యం – విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజాసేవ వరకు
రైతు కుటుంబంలో జన్మించిన డా. శివ నాగరాజు చిన్ననాటి నుంచే సామాజిక స్పృహతో ఎదిగారు.
1989–1996 మధ్య *స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)*లో చురుకుగా పనిచేశారు.
విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాల సందర్భంగా పలుమార్లు జైలుకూ వెళ్లిన అనుభవం ఉంది.
లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా చూసిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం *లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)*ను స్థాపించారు.
ఈ సంస్థ ద్వారా:
గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
గ్రామ ప్రజలకు అత్యల్ప ధరకు (20 లీటర్ల నీరు రూ.2కు) స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధుల ఏర్పాటు
విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు
గ్రామానికి చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం
ఈ సంస్థకు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.
పోటీ పరీక్షల శిక్షణ
గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో
గ్రూప్–1
గ్రూప్–2
ఇతర పోటీ పరీక్షలకు
ఉచిత మార్గదర్శక శిబిరాలు నిర్వహించారు.
జర్నలిజం ప్రస్థానం
1996లో ఈనాడు సంస్థలో కంట్రిబ్యూటర్‌గా ప్రారంభమైన ప్రయాణం…
తరువాత ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొంది
సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగు జర్నలిజంలో విశిష్ట సేవలందిస్తున్నారు.
పనిచేసిన సంస్థలు:
ఈనాడు
ఈటీవీ
ఎన్‌టీవీ
ఐ న్యూస్
ప్రస్తుతం TV9 తెలుగు – డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్
నిర్వహించిన బాధ్యతలు
కంట్రిబ్యూటర్
స్టాఫ్ రిపోర్టర్
సీనియర్ రిపోర్టర్
బ్యూరో చీఫ్
ఇన్‌పుట్ ఎడిటర్
చీఫ్ ఎడిటర్
రీసెర్చ్ ప్రొడ్యూసర్
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్
సేవలందించిన జిల్లాలు :
గుంటూరు
కర్నూలు
అనంతపురం
ఖమ్మం
విశాఖపట్నం
హైదరాబాద్
జర్నలిజంలో ప్రత్యేకత
వందలాది లైవ్ కార్యక్రమాలు
సమకాలీన అంశాలపై విశ్లేషణలు
ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు
రాజకీయ చర్చలు
సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు
పరిశోధనాత్మక వార్తలు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాద మరణ సమయంలో ఎన్‌టీవీలో అందించిన ప్రత్యక్ష ప్రసారాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.
పరిశోధన – రచనలు
డా. శివ నాగరాజు కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు…
ఒక పరిశోధకుడు, రచయిత కూడా.
చరిత్ర
పురావస్తు
సామాజిక అంశాలు
రాజకీయ విశ్లేషణ
గ్రామీణాభివృద్ధి
ప్రజాపాలన
వంటి అంశాలపై అనేక పరిశోధనా వ్యాసాలు, విశ్లేషణాత్మక కథనాలు, పత్రికా రచనలు చేశారు.
ప్రముఖ పత్రికలు, మాసపత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
కరోనా సమయంలో సేవలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ…
జాగ్రత్తలు
ఆరోగ్య సూచనలు
ప్రభుత్వ మార్గదర్శకాలు
ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక కథనాలు
సిద్ధం చేసి విశేష గుర్తింపు పొందారు.
గౌరవ డాక్టరేట్లు
1. ఏసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, చెన్నై
12 నవంబర్ 2022
జర్నలిజం, సామాజిక సేవ, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2. అమెరికాలోని థియేలాజికల్ యూనివర్సిటీ
జర్నలిజం, పరిశోధన, సామాజిక సేవ, మానవీయ విలువల ప్రచారానికి చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమేన్ లెటర్స్ (Honorary Doctor of Humane Letters) బిరుదును ప్రదానం చేసింది.
ప్రధాన పురస్కారాలు
ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు – 2022 (తెలంగాణ పర్యాటక శాఖ)
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) – బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరణ
2025లో…
తెలంగాణ గవర్నర్ జిష్ణదేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ జర్నలిస్టు అవార్డు
ప్రెస్ వింగ్స్ క్లబ్ – అచీవ్‌మెంట్ అవార్డు
ఈనాడు సంస్థలో బెస్ట్ స్టోరీ అవార్డులు
ఈటీవీలో ఉత్తమ కంటెంట్, ప్రత్యేక కథనాల అవార్డులు
ఎన్‌టీవీ బెస్ట్ రిపోర్టర్ అవార్డు
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణ ఘటనపై విశేష కవరేజీకి
ప్రత్యేక గుర్తింపులు
అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యునిగా సేవలు
పరిశోధనాత్మక జర్నలిజంలో విశేష గుర్తింపు
సమకాలీన రాజకీయాలపై లోతైన విశ్లేషణలకు పేరుప్రఖ్యాతులు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
టీవీ9 జర్నలిజం శిక్షణా కార్యక్రమాల్లో అతిథి అధ్యాపకుడిగా, మెంటర్‌గా సేవలు
యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం
వ్యక్తిత్వం
డా. కొండవీటి శివ నాగరాజు వృత్తి నిబద్ధత, నిజాయితీ, పరిశోధనాత్మక దృక్పథం, సామాజిక బాధ్యత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారు. జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా సమాజ సేవకు ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తున్నారు.
“వార్తను చెప్పడం మాత్రమే కాదు… సమాజంలో మార్పు తీసుకురావడం కూడా జర్నలిస్టు బాధ్యత” అనే విలువను తన వృత్తి జీవితమంతా ఆచరణలో చూపించిన పాత్రికేయుడు డా. కొండవీటి శివ నాగరాజు.
Online Harassment: ఆన్‌లైన్‌లో అవమానం.. అణుక్షణం వెంటాడే గాయం.. దీని నుంచి బయపడేదెలా?
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక సమాచార మార్పిడి ఎంత వేగవంతమైందో, అంతే వేగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. సరదా పేరిట చేసే పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకరమైన కామెంట్లు, బ్లాక్‌మెయిలింగ్‌లు సామాన్యుల నుంచి విద్యార్థులు, ఉద్యోగుల వరకు ఎందరినో మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. పరువు పోతుందనే భయంతో కొందరు మౌనంగా కుమిలిపోతుంటే, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ సైబర్ వేధింపుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? బాధితులు ఎలాంటి న్యాయపరమైన రక్షణ పొందవచ్చు? ఎదురైన సమస్యను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
- Siva Nagaraju
- Updated on: Oct 10, 2026
- 8:13 pm
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే.. మరి గ్రీన్‌కార్డు సంగతేంటి..?
లక్షలాది మంది భారతీయ టెక్కీలకు అమెరికా శాశ్వత నివాసం అందని ద్రాక్షలా మారుతోందా? హెచ్-1బీ వీసాలు రద్దు కాకపోయినా.. గ్రీన్‌కార్డు ప్రక్రియలో తాజాగా వచ్చిపడుతున్న సరికొత్త అడ్డంకులు వేల కుటుంబాల్లో ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ దిగ్గజాలపై అమెరికా నిబంధనల కొరడా ఝుళిపించడంతో టెక్కీలు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. అమెరికాలో భారతీయుల వాస్తవ పరిస్థితి ఏమిటి? ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఎందుకు చూడాల్సి వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Siva Nagaraju
- Updated on: Oct 9, 2026
- 9:47 pm
Hyderabad: ఏం ఎండలు బాబోయ్.. అక్టోబర్ వచ్చినా తగ్గని వేడి తీవ్రత.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ వచ్చిందంటే చలి కాలం మెల్లమెల్లగా మొదలవుతుంది. కానీ ఈ సారి చలికి బదులు ఎండ తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఎండ వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
- Siva Nagaraju
- Updated on: Oct 9, 2026
- 12:23 pm
Operation Firewall 2026: ఒక్క కాల్‌తో దేశ రహస్యాల వేట.. హనీ ట్రాప్‌తో రక్షణ సమాచారమే టార్గెట్.. 10 రాష్ట్రాల్లో స్పై నెట్‌వర్క్ గుట్టురట్టు!
Operation Firewall 2026: అక్టోబర్ 1న చేపట్టిన సమన్వయ ఆపరేషన్‌లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. రాష్ట్ర పోలీసులు..
- Siva Nagaraju
- Updated on: Oct 7, 2026
- 9:50 pm
ఒమన్ పక్కన పెడితే.. ఫ్లైదుబాయ్ ఎలా తీసుకుంది? కాక్‌పిట్ దాడి వెనుక నివ్వెరపోయే విషయాలు
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దుబాయ్-ఇజ్రాయెల్ ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ స్మిత్‌పై దాడి చేసిన.. కోపైలట్‌పై తీవ్రవాద అనుమానితుడిగా గతంలో ఆరోపణలు ఉన్నాయని.. అలాంటి పైలట్ ఫ్లైదుబాయ్‌లో ఎలా చేరాడన్నది భద్రతా లోపాలను ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయ విమానయాన భద్రతపై ఇది కొత్త చర్చకు తెరలేపింది.
- Siva Nagaraju
- Updated on: Oct 3, 2026
- 10:32 pm
Andhra Pradesh: ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు.. కరువుతో అన్నదాతలు ఆగమాగం..
ఆకాశం వైపు చూసి చూసి అన్నదాత కళ్లు కాయలు కాస్తున్నాయి.. వాన ముఖం చాటేసింది, చెరువుల్లో నీళ్లు ఇంకిపోయాయి, ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కాగితాలపై గణాంకాలు ఎలా ఉన్నా, పల్లెల్లో పచ్చని పొలాలు నెర్రెలు బారుతుండటమే అసలైన కరువుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఏపీలోని 21 జిల్లాల్లో ఏకంగా 388 మండలాలను ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించినా.. ఇంకా ఎన్నో గ్రామాల్లో అసలు నష్టాల లెక్కలు కాగితాలకెక్కడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
- Siva Nagaraju
- Updated on: Oct 3, 2026
- 9:52 pm
తెలంగాణలో నీటి గండం.. తగ్గిన వానలు, అడుగంటుతున్న జలాలు
తెలంగాణలో వానాకాలం ముగిసినా నీటి టెన్షన్ మొదలైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం వర్షపాతం లోటు నమోదైంది. 33 జిల్లాల్లో 18 జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గగా.. చెరువులు నిండక భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సాగు, తాగునీటి అవసరాలపై రాబోయే నెలల్లో ఆందోళన నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.
- Siva Nagaraju
- Updated on: Oct 2, 2026
- 6:28 pm
ఖైరతాబాద్ బైపోల్.. ఒక్క సీటు కోసం మూడు పార్టీల లెక్కలేంటి?
ఖైరతాబాద్ ఉపఎన్నికకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2023లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ అనర్హతతో సీటు ఖాళీ కావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
- Siva Nagaraju
- Updated on: Sep 25, 2026
- 7:23 pm
Hyderabad: వర్షం పడుతున్నా ఎండలు, ఉక్కపోత.. సెప్టెంబర్‌లోనే సమ్మర్ ఫీల్.. అక్టోబర్‌లో హైదరాబాద్ పరిస్థితి ఏంటి..?
హైదరాబాద్ వాసులకు విచిత్రమైన వాతావరణ అనుభవం ఎదురవుతోంది. ఆకాశం చూస్తే వర్షాకాలం.. బయటకు వస్తే మాత్రం మండుటెండ, దడపుట్టించే ఉక్కపోత.. సాధారణంగా సెప్టెంబర్ చివర్లో ఉష్ణోగ్రతలు తగ్గాలి.. కానీ భాగ్యనగరంలో గాలిలో తేమ ఏకంగా 90 శాతానికి పైగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్షం పడినా ఎందుకు చల్లబడటం లేదు? అసలు ఈ హీట్ ఇండెక్స్ లెక్కలేంటి? రాబోయే అక్టోబర్‌లో వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం..
- Siva Nagaraju
- Updated on: Sep 23, 2026
- 9:52 pm
Hyderabad: హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతోంది. రోడ్లపై వాన నీరు ప్రవహిస్తోంది. వాతావరణం కూడా చల్లబడుతోంది. అయినా నగరం ముందున్న మరో పెద్ద సమస్య నీటిదే. వర్షం పడుతున్నప్పుడే వచ్చే వేసవికి నీటి లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నగరం పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా నీటి అవసరం కూడా పెరుగుతోంది. అందుబాటులో ఉన్న వనరులు మాత్రం అంతే వేగంగా పెరగడం లేదు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Siva Nagaraju
- Updated on: Sep 22, 2026
- 10:18 pm
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు.. ఎల్‌నినో దెబ్బ ఎంత..?
ఎక్కడో సముద్రంలో మొదలైన వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో కూరగాయల ధరలను మండిస్తుందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వాతావరణ సంస్థల తాజా హెచ్చరికలు. పసిఫిక్‌లో బలపడుతున్న సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసి, పంటల దిగుబడి పడిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రాబోయే రోజుల్లో బియ్యం నుంచి నిత్యావసర సరుకుల ధరల వరకు ఎలాంటి కుదుపులు లోనవుతాయో తెలుసుకుందాం..
- Siva Nagaraju
- Updated on: Sep 22, 2026
- 9:52 pm
భక్తి, నమ్మకానికి ప్రతీక బాలాపూర్ గణేష్ లడ్డు.. వేలంలో వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా..?
హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం మూడు దశాబ్దాలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1994లో రూ.450తో ప్రారంభమైన వేలం 2025లో రూ.35 లక్షలకు చేరింది. భక్తుల విశ్వాసం, సంప్రదాయం, సామాజిక కార్యక్రమాలతో ముడిపడిన బాలాపూర్ లడ్డూ వేలం చరిత్ర, 1994 నుంచి 2025 వరకు విజేతలు, ధరల వివరాలు ఇవే.
- Siva Nagaraju
- Updated on: Sep 22, 2026
- 9:20 am