వైష్ణవి చైతన్య తన వయసుపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు ఆధార్ కార్డు చూపించి స్పష్టతనిచ్చింది. వికీపీడియాలో ఉన్న 32-33 ఏళ్ల వయసు తప్పు అని, తన అసలు వయసు 25 ఏళ్లే అని ఆమె ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు వికీపీడియాలో వివరాలను మార్చాలని కోరుతున్నారు. బేబీ తర్వాత వరుస సినిమాలతో వైష్ణవి బిజీగా ఉంది.