తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన కలిగించింది. 2,765వ మెట్టు సమీపంలోని చెట్టుపై చిరుత కనిపించడంతో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా నడకమార్గంలో పంపిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.