విడాకులు పెరగడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. జంటలు ఒకరికొకరు సమయం కేటాయించుకోకుండా, ఫోన్లలో నిమగ్నమవడం వల్ల బంధాలు దెబ్బతింటున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే, తాను తన భర్త ప్రతి వారం కచ్చితంగా డిన్నర్‌కు వెళ్లి నాణ్యమైన సమయాన్ని గడుపుతూ, తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటామని కాజల్ వివరించారు.