AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం.. ఇలా పెడితే వినాయకుడి అనుగ్రహం!

భారతీయ వంటకాల్లో పెరుగు వడ ప్రత్యేక అల్పాహారం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. వడలు లోపలి వరకు పెరుగును పీల్చుకుని, సాఫ్ట్‌గా, స్పాంజీగా రావాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ఈ రెసిపీలో, గ్రైండర్ లేకుండా కేవలం మిక్సీ జార్‌ను ఉపయోగించి అద్భుతమైన పెరుగు వడలను ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 22, 2026 | 9:52 PM

Share
ముందుగా ముప్పావు కప్పు మినపగుళ్లను శుభ్రంగా కడిగి, నాలుగు నుండి ఆరు గంటల పాటు నానబెట్టండి. రాత్రంతా నానబెట్టినా పర్వాలేదు.నానిన మినపగుళ్లను మిక్సీ జార్‌లో వేసి, వీలైనంత తక్కువ నీటితో గట్టిగా రుబ్బుకోవాలి. చిన్న మిక్సీ జార్ ఉపయోగిస్తే నీళ్లు తక్కువ పట్టి పిండి చక్కగా నలుగుతుంది. నీళ్లు ఎక్కువగా కలిపితే వడలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి.

1 / 5

రుబ్బిన పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడా కలపాలి. (గ్రైండర్‌లో రుబ్బితే వంటసోడా అవసరం లేదు). ఇప్పుడు ఒక స్పూన్‌తో లేదా చేతితో కనీసం ఐదు నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో గాలి చేరి, వడలు స్పాంజీగా, ఫ్లఫీగా తయారవుతాయి. పిండిని కొద్దిగా నీటిలో వేస్తే తేలితే, పిండి పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు.1

2 / 5
ఒక బౌల్‌లో నాలుగు కప్పుల చిక్కటి పెరుగు తీసుకుని, కవ్వంతో మెత్తగా చిలకాలి. కొద్దిగా నీళ్లు కలిపి గట్టి మజ్జిగలా తయారు చేసుకోవాలి. ఇది మరీ పలుచగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. చిన్న పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయాలి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు, ½ టీస్పూన్ పసుపు వేసి కలపండి. చివరగా ¼ టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఈ తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మజ్జిగలో కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి. కొత్తిమీర పెరుగు వడకు అద్భుతమైన రుచిని ఇస్తుంది.

3 / 5
నూనెను వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. చేతిని కొద్దిగా తడిపి, చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని వడలుగా ఒత్తుకోండి. చేతితో కష్టం అనిపిస్తే టీ స్ట్రైనర్‌ను ఉపయోగించవచ్చు. నూనెలో నాలుగు లేదా ఐదు వడలను వేసి, రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు, మధ్యలో కూడా చక్కగా వేగేంతవరకు ఫ్రై చేయండి.వేయించిన వడలను వెంటనే తీసుకుని, గోరువెచ్చని నీటి ఉన్న బౌల్‌లో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉంచాలి.

4 / 5
ఇలా చేయడం వల్ల వడలు మజ్జిగను బాగా పీల్చుకుంటాయి. ఎక్కువసేపు నీటిలో ఉంచితే చప్పగా అయిపోతాయి కాబట్టి సమయం చూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత వడలను నీటి నుండి తీసి, మెల్లగా పిండేసి, సిద్ధంగా ఉన్న పెరుగులోకి మార్చండి. అన్ని వడలు వేసి పెరుగులో వేసిన తర్వాత, కనీసం అరగంట పాటు నానబెట్టనివ్వండి. ఇలా అరగంట నానిన తర్వాత వడలు పెరుగును లోపలి వరకు పీల్చుకుని సాఫ్ట్‌గా, రుచిగా తయారవుతాయి.

5 / 5
Follow Us