AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండాపోయిన బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చే అవకాశాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల కుటుంబాలకు చెందిన నటీనటులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకుంటే.. మరికొందరు కొద్దికాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఒకరే నిషా అగర్వాల్.

Rajeev Rayala
|

Updated on: Sep 22, 2026 | 9:55 PM

Share
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు. వరుస అవకాశాలు అందుకోవడంతో పాటు.. వచ్చిన ప్రతి సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. కొందరు హీరోయిన్లు వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకుంటే.. మరికొందరు తక్కువ సినిమాలతోనే తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంటారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒకరు.

1 / 5
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులోకి అడుగుపెట్టిన సమయంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా యూత్‌లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి తన నటనతో ఆకట్టుకుంది.

2 / 5
సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా.. హీరోయిన్‌గా కళ్యాణికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమాలో కనిపించింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ మూవీతో కళ్యాణి టాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. చిత్రలహరి తర్వాత శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ సినిమాలో కళ్యాణి నటించింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో తెలుగులో కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఆశించినంత వేగంగా ముందుకు సాగలేదు.

3 / 5
మొత్తంగా టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు మూడే. వాటిలో ‘చిత్రలహరి’ మంచి విజయాన్ని అందుకోగా.. మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయాయి. సినిమాలు తక్కువగా చేసినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్‌కు తెలుగులో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందం, సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె సినిమాలు పెద్దగా కనిపించకపోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ బ్యూటీని మళ్లీ వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు.

4 / 5
 తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానంగా మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది. అక్కడ వరుస ప్రాజెక్టులతో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తనకు నచ్చే కథ, మంచి పాత్ర లభిస్తే తెలుగులో మళ్లీ నటించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి ప్రియదర్శన్.. భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరో మంచి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. అప్పటివరకు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది.

5 / 5
Follow Us