AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ దౌత్యం.. ఇటు పుతిన్‌తో దోస్తీ. అటు జిన్‌పింగ్‌తో మాటామంతీ.. మధ్యలో అమెరికాతో సర్దుబాటు!

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ 'బిగ్ పవర్ గేమ్‌' ఆడుతున్నారు. ఒకవైపు రష్యా, చైనాలతో కీలక చర్చలు జరుపుతూనే, మరోవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. భారత ప్రయోజనాలే లక్ష్యంగా, చమురు, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక సహకారం కోసం బహుళ వ్యూహాలను అవలంబిస్తున్నారు. బ్రిక్స్‌ను ప్రపంచ సమస్యల పరిష్కార వేదికగా భారత్ బలోపేతం చేయాలనుకుంటోంది.

ప్రధాని మోదీ దౌత్యం.. ఇటు పుతిన్‌తో దోస్తీ. అటు జిన్‌పింగ్‌తో మాటామంతీ.. మధ్యలో అమెరికాతో సర్దుబాటు!
Pm Modi, Vladimir Putin, Xi Jinping , Donald Trump
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 11, 2026 | 10:18 PM

Share

ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా ఢిల్లీపై పడింది. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్వాదిమిర్ పుతిన్‌, మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌. ఇద్దరితోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకంగా మాట్లాడబోతున్నారు. అదే సమయంలో అమెరికాతోనూ భారత్‌ తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఒకరి కోసం ఇంకొకరిని వదిలేయడం లేదు. దేశానికి ఎక్కడ ఏది అవసరమో, అక్కడ దాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందినకాడికి అందిపుచ్చుకోవాలనే సామెతలా అన్ని వైపులా తలుపులు తెరిచి ఉంచుతోంది. ఇదే ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తున్న అసలు లెక్క. ఢిల్లీ వేదికగా బ్రిక్స్‌ సదస్సు.. BRICSలో భారత్‌, రష్యా, చైనా సహా 11 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో పెద్ద భాగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచ వ్యాపారంలోనూ వీటి వాటా గణనీయంగా ఉంది. అందుకే ఢిల్లీలో జరుగుతున్న సమావేశం మామూలు మీటింగ్‌ కాదు. యుద్ధాలు, చమురు ధరలు, వ్యాపారం, టెక్నాలజీ, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు.. ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలపై ఇక్కడ చర్చ జరగనుంది. ముఖ్యంగా.. అమెరికా, యూరప్‌ దేశాల మాటలతో పాటు మిగతా దేశాల గొంతుక కూడా ప్రపంచంలో బలంగా వినిపించాలన్నది BRICSలోని ప్రధాన ఆలోచన. పుతిన్‌తో మోదీ భేటీ.. ముందుగా పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. రష్యా భారత్‌కు పాత మిత్రదేశం. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఆయుధాల విషయంలో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు దానికి చమురు కూడా తోడైంది. 2026 జూలైలో భారత్‌ దిగుమతి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి