AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? పురాతన కాలం నాటి ఈ కుడుములు తింటే పూర్తిగా మాయం

మన పూర్వీకులు అందించిన అద్భుతమైన సంప్రదాయ వంటకాలలో ఇప్పపూల కుడుములు ప్రత్యేకమైనవి. కీళ్ల నొప్పులు తగ్గించడానికి, నిద్ర బాగా పట్టడానికి, శ్వాస సంబంధిత సమస్యలకు ఇది ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం. ఇప్పపూలు నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, దగ్గు వంటి వాటికి ఇవి మంచి నివారణగా పనిచేస్తాయి

Prasanna Yadla
|

Updated on: Oct 02, 2026 | 8:02 AM

Share
మన పూర్వీకులు అందించిన అద్భుతమైన సంప్రదాయ వంటకాలలో ఇప్పపూల కుడుములు ప్రత్యేకమైనవి. కీళ్ల నొప్పులు తగ్గించడానికి, నిద్ర బాగా పట్టడానికి,  శ్వాస సంబంధిత సమస్యలకు ఇది ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం. ఇప్పపూలు నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, దగ్గు వంటి వాటికి ఇవి మంచి నివారణగా పనిచేస్తాయి. వీటిలో సహజమైన ఔషధ గుణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తాయి.

1 / 5

ముందుగా, ఎండబెట్టిన ఇప్పపూలను అర కప్పు వరకు తీసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, గ్రైండ్ చేసుకున్న ఇప్పపూల పొడిని వేయాలి. దానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, అర కప్పుకు కొంచెం తక్కువగా తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడం కోసం పావు కప్పు వరకు నీళ్లు పోసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి.

2 / 5
బెల్లం పూర్తిగా కరిగి కొద్దిగా తేమగా తయారైనప్పుడు రుచి చూసి, అవసరమైతే ఇంకొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, మంటను లో ఫ్లేమ్‌కు మార్చి, కొబ్బరి లౌజు లాగా ముద్దగా మారే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం చేతితో ముద్ద చేయడానికి వీలుగా తయారైన తర్వాత, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే కడాయిని శుభ్రం చేసుకుని, ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. కుడుముల పైన పొర చప్పగా ఉండకుండా ఉండటం కోసం రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి గానీ లేదా పంచదార గానీ వేసుకోవాలి. నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత, ముప్పావు కప్పు పొడి బియ్యం పిండి వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి నీళ్లలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత, మూతపెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా, చేతితో తాకడానికి వీలుగా ఉన్నప్పుడు మెత్తని పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత, మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

4 / 5
ఉండలుగా చేసుకున్న పిండిని చపాతీ పీట మీద కొద్దిగా పొడి బియ్యం పిండి చల్లుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీ మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న ఇప్పపూలు-కొబ్బరి మిశ్రమాన్ని తగినంత పెట్టుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా ఉండటానికి అంచులను గట్టిగా ఒత్తాలి లేదా కొద్దిగా నీళ్లతో తడి చేసి అంటించుకోవచ్చు. ఇడ్లీలు ఉడికించినట్లే వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి, ప్లేట్‌కు అతుక్కోకుండా ఉండటానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఇడ్లీ ప్లేట్లలో కుడుములను పెట్టి, గార్నిషింగ్ కోసం కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని మూతపెట్టాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

5 / 5
Follow Us
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!

గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే

అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్

అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్

అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?

మతిపోగొట్టే రేంజ్ తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ప్రత్యేకతలు ఇవే

22 నిమిషాల్లో 80% ఛార్జింగ్! కొత్త ఎలక్ట్రిక్ SUV స్పెషాలిటీ ఇదే