AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.80 వేల బైక్‌కు రూ.10.30 లక్షల చలాన్లు.. 126 కేసులతో పోలీసులకు దొరికిన బైకర్!

గురుగ్రామ్‌లో రూ.80 వేల బైక్‌పై రూ.10.30 లక్షల పెండింగ్ చలాన్లు నమోదైన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక యువకుడు రాంగ్ రూట్‌లో పట్టుబడగా, పోలీసుల తనిఖీలో 126 చలాన్లు వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలతో ఈ భారీ మొత్తం పేరుకుపోయింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

రూ.80 వేల బైక్‌కు రూ.10.30 లక్షల చలాన్లు.. 126 కేసులతో పోలీసులకు దొరికిన బైకర్!
Gurugram Traffic Challans
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 8:34 AM

Share

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.80 వేల విలువైన బైక్‌పై ఏకంగా రూ.10.30 లక్షల మేర పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం ఉద్యాగ్ విహార్‌లోని శంకర్ చౌక్ సమీపంలో ఓ యువకుడు బైక్‌ను రాంగ్ రూట్‌లో నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ను తనిఖీ చేయగా మొత్తం 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బైక్‌ను అంకేష్ కుమార్ అనే వ్యక్తి 2023 జూలైలో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బైక్‌పై వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ కలిగి ఉండటం వంటి ఉల్లంఘనలకు పలుమార్లు జరిమానాలు విధించారు. అయితే ఇప్పటివరకు ఒక్క చలాన్ కూడా చెల్లించలేదని పోలీసులు తెలిపారు.

తాజాగా మళ్లీ రాంగ్ సైడ్‌లో బైక్ నడుపుతూ పట్టుబడటంతో అధికారులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పెండింగ్ చలాన్ల మొత్తం రూ.10.30 లక్షలకు చేరినట్లు తేలింది. అంటే బైక్ అసలు ధర కంటే అనేక రెట్లు ఎక్కువగా జరిమానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే చలాన్లు ఎలా పేరుకుపోతాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం బైక్‌పై నమోదైన అన్ని చలాన్లను పరిశీలిస్తున్న పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!