AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో DRI భారీ ఆపరేషన్.. 17 కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం..!

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ విక్రయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. నిర్దిష్ట సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు.. ఏనుగు దంతాల విక్రయానికి సంబంధించిన లావాదేవీ జరుగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో DRI భారీ ఆపరేషన్.. 17 కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం..!
Elephant Ivory Seizure
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 10:14 AM

Share

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ విక్రయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. నిర్దిష్ట సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు.. ఏనుగు దంతాల విక్రయానికి సంబంధించిన లావాదేవీ జరుగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 17 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దంతాలతో నైపుణ్యంగా తయారు చేసిన ఐవరీ వస్తువులు, ట్రోఫీలను కూడా సీజ్ చేశారు.

ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి సంబంధించి సమాచారం అందడంతో డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విక్రయ లావాదేవీ జరుగుతున్న ప్రాంతంపై నిఘా పెట్టి.. సరైన సమయంలో వలపన్ని ముగ్గురిని పట్టుకున్నాయి. అనంతరం స్వాధీనం చేసుకున్న దంతాలు, ఐవరీ వస్తువులను చట్ట ప్రకారం సీజ్ చేశారు.

వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఏనుగు దంతాలను విక్రయించడం, కొనుగోలు చేయడం, వ్యాపారం చేయడం లేదా వాటితో తయారు చేసిన వస్తువులను అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

వన్యప్రాణుల అక్రమ రవాణా, రక్షిత జంతువుల అవయవాలు, ట్రోఫీల అక్రమ వ్యాపారంపై దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ నిఘా కొనసాగిస్తోంది. ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహిస్తున్న ఆపరేషన్లలో భాగంగానే హైదరాబాద్‌లో తాజా దాడి చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దంతాల మూలం, నిందితుల నెట్‌వర్క్, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఇతర వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us